Thursday, 19 December 2019

ఎంతమంచి వాడవురా ‘అవునో తెలియదు’ సాంగ్.. ఎంత మంచిగా ఉందో

నందమూరి కళ్యాణ్ రామ్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటించిన లవ్ అండ్ ఫ్యా మిలీ ఎంటర్ టైనర్ మూవీ ‘’ చిత్రం నుండి మరో బ్యూటిఫుల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. గోపీ సుందర్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల కానుండగా.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘అవునో తెలియదు’ అనే బ్యూటిఫుల్ సాంగ్‌ను గురువారం నాడు విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సాంగ్‌ను శ్రేయాగోశల్ ఆలపించగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. గోపీ సుందర్ బ్యూటిఫుల్ ట్యూన్ ఇచ్చారు. ఈ చిత్రంలోని తొలిసాంగ్ ఏమో ఏమో ఈ గుండెల్లో మంచి రెస్పాన్స్ రాబట్టింది. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా ఆలపించారు. నేడు విడుదలైన ‘అవునో తెలియదు’ సాంగ్ సైతం వినసొంపుగా ఉంది. ఎమ్మెల్యే, నా నువ్వే, ఎన్టీఆర్ కథానాయకుడు, 118 లాంటి వరుస పరాజయాలతో ఢీలా పడ్డ కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ అనే ఫీల్ గుడ్ మూవీతో హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నారు. ఇక దర్శకుడు సతీష్‌ వేగేశ్న ‘శతమానం భవతి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంతో ఫ్లో కంటిన్యూ చేయలేకపోయారు. హీరోగా కళ్యాణ్ రామ్‌కి.. దర్శకుడిగా సతీష్‌ వేగేశ్న‌కు ‘ఎంత మంచి వాడవురా’ రిజల్ట్ కీలకంగా మారింది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్‌తో మెహ్రీన్ జోడీ కట్టగా.. వి.కె.న‌రేష్, సుహాసిని, శరత్‌బాబు, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల‌ కిశోర్‌, ప్రవీణ్‌, ప్రభాస్ శ్రీను త‌దిత‌రులు నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ttwRFL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...