Saturday, 21 December 2019

Disha Case: ‘దిశ’ పాత్రలో సమంత.. ఛాలెంజింగ్ రోల్‌కి ‘సై’!

శంషాబాద్‌ వెటర్నరీ వైద్యురాలు హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నలుగురు యువకుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసి చంపేయడంతో దిశ ఘటనపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా.. దిశను దారుణంగా రేప్ చేసి చంపేసిన నిందితుల్ని ఎన్ కౌంటర్ చేయడంపై మెజారిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేసి తెలంగాణ పోలీసులకు జేజేలు పలికారు. దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న దిశ ఘటనను ఆధారంగా చేసుకుని ఓ సినిమాను తెరకెక్కించేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రియలిస్టిక్ కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను తీయడంలో ముందుండే తమిళ దర్శకులు దిశ ఉదంతాన్ని సినిమాగా తీయడానికి ముందుకొస్తున్నారు. తమిళ దర్శకుడు శరవరణ్ దిశహత్యోదంతం, నిందితుల ఎన్ కౌంటర్ తదనంతర పరిణామాలపై స్క్రిప్ట్ రెడీ చేసుకుని సౌత్ స్టార్ హీరోయిన్ సమంతను దిశగా చూపిస్తూ స్క్రిప్ట్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ముందే సమంతతో చర్చలు జరిపి యుద్ధప్రాతిపదికను స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట దర్శకుడు శరవరణ్. ప్రయోగాత్మక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపించే సమంత.. ‘దిశ’గా మరో ప్రయోగం చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ ‘96’ మూవీ రీమేక్‌లో నటిస్తోంది. ఈ చిత్రం పూర్తైన వెంటనే కొత్త ప్రాజెక్ట్‌ను ఓకే చేయనున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. ‘దిశ’ పాత్రలో సమంత అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MjvNed
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...