ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డికి స్పెషల్ విషెష్ అందించారు మంచు హీరో మనోజ్. నేడు జగన్ బర్త్ డే సందర్భంగా విషెష్‌ను అందిస్తూ ఆసక్తికరమైన ఫొటోను షేర్ చేశారు. జగన్‌ను బావా అంటూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మలతో కలిసి ఉన్న జగన్ చిన్ననాటి ఫొటోను షేర్ చేస్తూ ‘దేశంలోనే యంగ్ సీఎం.. నేను ఎంతగానో ప్రేమించే మా బావ వైఎస్ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ లైఫ్ ఎంతో సంతోషకరంగా సంపన్నంగా ఉండాలి సీఎం గారూ’ అంటూ స్పెషల్ విషెష్ అందించారు . మంచు మనోజ్‌కి జగన్ బావ ఎలా అయ్యారంటే!! మంచు మనోజ్ వదిన విరోనిక (విష్ణు భార్య) వైఎస్ కుటుంబానికి చెందని ఆడబిడ్డే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో తమ్ముడు సుధీర్ రెడ్డి కూతురే విరోనిక. జగన్, విరోనికలు అన్నదమ్ముల బిడ్డలు కావడంతో జగన్‌కి చెల్లి వరస అవుతుంది విరోనిక. మంచు విష్ణు విరోనికను ప్రేమ వివాహం చేసుకోవడంతో వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఏర్పడింది. ఈ వరసన వైఎస్ జగన్‌ను బావా అంటూ సంభోదించారు మనోజ్. Read Also: Read Also: Read Also:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Q9vIuF
v
No comments:
Post a Comment