Saturday, 7 December 2019

కొనసాగుతున్న `కేజీఎఫ్‌` హవా.. మరో అరుదైన ఘనత సాధించిన సౌత్ సినిమా

ఒకప్పుడు కన్నడ సినిమా అంటే అనామక ఇండస్ట్రీ అన్న పేరుండేది. కానీ ఆ అభిప్రాయాన్ని తుడిచిపెట్టేసిన సినిమా . యష్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్ అయ్యింది. రిలీజ్‌ అయిన రోజు అద్భుతమైన టాక్‌ రాకపోయినా.. నెమ్మదిగా పిక్‌అప్‌ అయి బిగ్గెస్ట్ హిట్‌గా అవతరించింది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ్‌, మలయాళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో రికార్డ్‌ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన కేజీఎఫ్‌, సౌత్‌ సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. సినిమా రిలీజ్ అయిన 50 రోజుల తరువాత అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యింది కేజీఎఫ్‌. Also Read: ఇప్పుడు ఆ డిజిటల్‌ ప్లాట్‌ఫాంలోనే రికార్డ్‌ సృష్టించింది కేజీఎఫ్‌. 2019లో అమెజాన్‌ ప్రైమ్‌లో అత్యధిక వ్యూస్‌ సాధించిన సినిమాగా రికార్డ్‌ సృష్టించింది కేజీఎఫ్‌. సినిమాకు సూపర్‌ పాజిటివ్‌ టాక్‌ రావటంతో థియేరట్లలో మిస్‌ అయిన ప్రేక్షకులందరూ డిజిటల్‌లో చూసేందుకు ఉత్సాహం చూపించారు. దీంతో రికార్డ్‌ వ్యూస్‌ సాధించింది కేజీఎఫ్‌. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన సినిమా కేజీఎఫ్‌. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిచేందుకు ప్లాన్ చేశారు. తొలి భాగం సూపర్‌ హిట్ అవ్వటంతో రెండో భాగాన్ని మరింత భారీగా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సీక్వెల్‌లో బాలీవుడ్‌ హీరో ప్రతినాయక పాత్రలో నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న కేజీఎఫ్‌ చాప్టర్‌-2 సినిమాను 2020 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. See Photo Story:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RpJ8Fn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...