Saturday, 7 December 2019

‘నువ్వు డ్రగ్స్ తీసుకుంటావా అని మహేష్ బాబు అడిగారు’

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు రవి వర్మ. 2005లో వచ్చిన ‘వెన్నెల’ సినిమాతో ఆయన తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఐదు కోట్లు రాబట్టి మంచి హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో రవి వర్మ డ్రగ్ అడిక్ట్ పాత్రలో నటించారు. దాంతో ఆయన క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది. అయితే ఈ సినిమాను సూపర్‌స్టార్ కూడా చూశారట. ఈ విషయాన్ని రవి వర్మ ఓ సందర్భంలో తెలిపారు. ఓ సినిమా షూటింగ్‌లో మహేష్.. రవి వర్మను చూడగానే ఓ ప్రశ్న అడిగారట. అది విని తాను షాకయ్యానని రవి వర్మ అన్నారు. ‘అయితే నువ్వు డ్రగ్స్ బాగా తీసుకుంటావన్నమాట’ అని మహేష్ అన్నారట. దాంతో సెట్స్‌లో ఉన్నవారంతా పగలబడి నవ్వుకున్నారట. 2015లో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమాలో రవి వర్మ నటించారు. ‘అసుర’, ‘క్షణం’, ‘టెర్రర్’, ‘రాజా చెయ్యి వేస్తే’, ‘సత్య’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు రవి వర్మ. ప్రస్తుతం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DVDId7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...