Monday, 16 December 2019

రజినీకాంత్ ‘దర్బార్’ ట్రైలర్: పోలీసా వాడు.. హంతకుడు!

సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన చిత్రం ‘దర్బార్’. క్రియేటివ్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రజినీకాంత్‌తో మురుగుదాస్ పనిచేయడం ఇదే తొలిసారి. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన రజినీకాంత్ లుక్, మోషన్ పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమిళనాట అయితే అప్పుడే ‘దర్బార్’ మానియా మొదలైపోయింది. తమిళంతో పాటు తెలుగు, హిందీలో జనవరి 9న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది. ఈ క్రమంలో తాజాగా ‘దర్బార్’ ట్రైలర్‌ను విడుదల చేసింది. తలైవా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. ట్రైలర్ చాలా రిచ్‌గా ఉంది. ఫైట్స్, డైలాగులు అదిరిపోయాయి. ‘వాడు పోలీస్ ఆఫీసరా సార్.. హంతకుడు’ అనేది ట్రైలర్‌లో మొదటి డైలాగ్. 60 ఏళ్ల వయసులోనూ రజినీకాంత్ స్టైల్, లుక్ అబ్బో.. వర్ణించలేం. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి విలన్‌గా నటించారు. ‘దర్బార్’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఆడియోను కూడా ఇటీవలే విడుదల చేశారు. అనిరుధ్ అందించిన అన్ని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టకుంటున్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది. ‘దర్బార్’లో రజినీకాంత్ ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్‌గా రజినీకాంత్ నటించి పాతికేళ్ళు అయ్యింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సుబస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ కూడా చిత్ర నిర్మాణంలో భాగస్వామి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34r4x3M
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...