Monday, 16 December 2019

హీ ఈజ్ సో క్యూట్.. మహేష్‌ను ఆటపట్టిస్తోన్న రష్మిక

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా వస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి 13 ఏళ్ల తరవాత ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి వస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ విడుదలైంది. అలాగే రెండు పాటలు కూడా వచ్చాయి. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘మైండ్ బ్లాకు’ అంటూ సాగే మాస్ నంబర్ మహేష్ ఫ్యాన్స్ చేత స్టెప్పులేయించింది. ఇప్పుడు ఈ సినిమాలోని మరో పాటను విడుదల చేశారు. ‘హీ ఈజ్ సో క్యూట్.. హీ ఈజ్ సో హాట్.. హీ ఈజ్ సో హ్యాండ్సమ్’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌ను సోమవారం సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేశారు. మ‌హేష్ గ్లామ‌ర్‌ను పొగిడే ఈ పాట సినిమాలో హీరోయిన్ మనసుని హీరో దోచుకున్న సందర్భంలో వస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. రష్మిక, మహేష్ ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ సాగే ఈ రొమాంటిక్ పాటకి శ్రీమణి మంచి సాహిత్యం అందిచ‌గా మధు ప్రియ చ‌క్కగా ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ మంచి ట్యూన్ అందించారు. ఈ పాటలో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, అదిరిపోయే డాన్స్ మూమెంట్స్‌తో తన అభిమానులతో పాటు మహేష్ ఫ్యాన్స్‌ను కూడా రష్మిక బాగా ఆకట్టుకుందని చిత్ర వర్గం వెల్లడించింది. కాగా, ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 5న అంటే ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైద‌రాబాద్ ఎల్‌.బి స్టేడియంలో ప్రారంభమవుతుంది. Also Read: దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ppu60U
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...