హీరోగా, నిర్మాతగా సక్సెస్ అయిన వ్యాపారరంగంలోనూ దూసుకుపోతున్నాడు. ఈ యంగ్ హీరో నిర్మాతగా మారి రూపొందించిన తొలి చిత్రం ''. నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చిన ఈ సినిమా, కథానాయకుడిగా సందీప్ కిషన్‌కు మంచి విజయం అందించింది. బీఏబీఎల్‌తో మరో కమర్షియల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు సందీప్ కిషన్. ఇలా వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న సందీప్ ఇటీవల తన పేరెంట్స్‌కు బెంజ్ జీఎల్‌ఈ 350డీ కారును గిప్ట్ ఇచ్చాడు. ఫుల్ జోష్‌లో ఉన్న ఈ యంగ్ హీరో తాజాగా మరో వ్యాపారాన్ని మొదలెడుతున్నాడు. Also Read: నటుడిగా నిర్మాతగా కొనసాగుతూనే వ్యాపారరంగంలోనూ దూసుకుపోతున్నాడు సందీప్. హైదరాబాద్, సికింద్రాబాద్ లో `వివాహ భోజనంబు` పేరుతో ఆయనకు రెస్టారెంట్లు ఉన్నాయి. రెస్టారెంట్ బిజినెస్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్న సందీప్ తాజాగా కొత్త రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో ఆయన ఒక సెలూన్ ప్రారంభించనున్నాడు. స్టైలింగ్ రంగంలో మంచి పేరున్న క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తీసుకున్నారు. త్వరలో ఆ సెలూన్ ప్రారంభం కానుంది. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే... హాకీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సందీప్ కిషన్ `ఏ1 ఎక్స్‌ప్రెస్` సినిమాలో నటిస్తున్నాడు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2sEHEws
v
No comments:
Post a Comment