Friday, 6 December 2019

ఆ అపరాధానికి ఒక్క ట్వీట్ సరిపోదు.. ‘దిశ’ ఘటనలో తన సైలెన్స్‌‌పై సమంత

ప్రస్తుతం సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ట్వీట్లు, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే చాలా విషయాలపై స్పందిస్తున్నారు. అయితే.. కొన్ని ఘటనలు, విషయాలపై స్టార్లు స్పందించకపోతే వాళ్లను నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. తిట్టిపోస్తున్నారు. ‘మహర్షి’ సినిమాపై రాజమౌళి స్పందించకపోవడంపై మహేష్ బాబు అభిమానులు ఆయన్ని టార్గెట్ చేశారు. అలాగే తాజాగా దిశ ఘటనపై సమంత స్పందించలేదని నెటిజన్లు ఆమెను తిట్టిపోశారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినా సమంత ఎందుకు స్పందించడంలేదంటూ సోషల్ మీడియాలో ఆమెను ట్యాగ్ చేసి మరీ తిట్టారు. అయితే, దిశ ఘటనలో తన సైలెన్స్‌పై తాజాగా సమంత వివరణ ఇచ్చారు. Also Read: దిశ కేసులో నిందితులను శుక్రవారం తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్, శివ మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రజల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తూ సమంత కూడా ట్వీట్ చేశారు. ‘‘ఐ లవ్ తెలంగాణ. భయం అనేది గొప్ప పరిష్కారం. కొన్నిసార్లు ఇదెక్కటే పరిష్కారం’’ అని సమంత ట్వీట్ చేశారు. ఇదే సమయంలో తాను గతంలో ఈ ఘటన గురించి ఎందుకు స్పందించలేదో కూడా మరో ట్వీట్‌లో వివరించారు సమంత. ‘‘దిశ ఘటన జరిగినప్పుడు నేను ఏం మాట్లాడలేకపోయాను. ఎందుకంటే, బాధితులకు నా సంతాపం చెల్లించలేదని ఆరోపిస్తూ నాకు వచ్చిన ప్రతి సందేశం సమాజంలో ఉన్న మహిళలకు నేనేమీ సాయం చేయలేదనే విషయాన్ని గుర్తుచేశాయి. ఆ అపరాధం నుంచి నన్ను విడిపించడానికి ఒక్క ట్వీట్ సరిపోదనిపించింది’’ అని సమం ట్వీట్‌లో పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34Vn615
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...