క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. సుమారు రెండున్నరేళ్ల విరామం తరవాత కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. మరాఠి సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే.. బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా కూడా నటిస్తున్నట్లు కృష్ణవంశీ ప్రకటించారు. అయితే, ఈ సినిమాలో యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ కూడా నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ డైరెక్టర్ కృష్ణవంశీ అధికారికంగా ప్రకటించారు. ‘‘సెన్సియస్ సెన్సేషన్, స్పార్క్‌లింగ్, ఆల్వేజ్ స్మైలింగ్ అమేజింగ్ అనసూయతో వర్క్ చేస్తుండటం చాలా సంతోషం. రంగమార్తండలో ఆమె స్పైసీ రోల్‌లో కనిపించనుంది’’ అని కృష్ణవంశీ ట్వీట్ చేశారు. అంతేకాదు, సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న అనసూయ ఫొటోను కూడా పొందుపరిచారు. అయితే, ఆమె ఫస్ట్‌లుక్ ఇదేనా అనే విషయంలో స్పష్టత లేదు. అనసూయ ఇప్పటికే రంగమ్మత్తగా ఫేమస్ అయిపోయారు. సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించిన అనసూయ ఆ పాత్రకే వన్నె తెచ్చారు. మరి ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ చేతిలో పడిన అనసూయ.. ఈ సినిమాలో ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి. అసలే స్పైసీ రోల్ అంటున్నారు. అంటే నటనలో స్పైసీనా.. అందాలు ఆరబోయడంలో స్పైసీనా చూడాలి. ఈ సినిమాలో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా ఒక పాత్ర పోషిస్తున్నారని టాక్. కానీ, ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ‘రంగమార్తాండ’కు ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RXlwIt
v
No comments:
Post a Comment