Wednesday, 4 December 2019

మైండ్‌ బ్లాక్‌ చేసిన సూపర్‌ స్టార్‌.. మహేష్‌ ఆల్‌టైం రికార్డ్‌

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా . అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కామెడీ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతుంది. ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సూపర్‌ స్టార్‌ మండేస్‌ అంటూ ప్రతీ సోమవారం ఓ అప్‌డేట్‌ ఇస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సోమవారం మైండ్‌ బ్లాక్‌ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకత్వంలో మాస్‌ బీట్స్‌తో రూపొందించిన ఈ పాటపై డివైడ్‌ టాక్‌ వచ్చిన యూట్యూబ్‌ వ్యూస్‌లో మాత్రం సంచలనాల నమోదు చేస్తోంది. మహేష్‌ మేనియాతో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న ఈ పాట 24 గంటల్లో 9.2 మిలియన్ల వ్యూస్‌ సాధించింది. సౌత్‌లో తొలి 24 గంటల్లో అత్యధిక వ్యూస్‌ సాధించిన పాటగా రికార్డ్‌ సృష్టించింది మైండ్‌ బ్లాక్‌. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో చాలా కాలం తరువాత సీనియర్‌ నటి విజయశాంతి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది. కొంతకాలంగా క్లాస్‌ మెసేజ్‌ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే చేస్తున్న మహేష్ బాబు ఈ సినిమాతో ట్రెండ్‌ మారుస్తున్నాడు. కామెడీతో పాటు మాస్‌ యాక్షన్‌తోనూ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం భారీగా హైప్‌ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా సూపర్‌ స్టార్‌ అభిమానులకు సంక్రాంతి పండుగ ముందే తీసుకువస్తుందంటున్నారు చిత్రయూనిట్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2rQkXVM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...