Friday, 27 December 2019

‘అశ్వథ్థామ’ టీజర్: గమ్యం తెలియని ఒక యుద్ధం

యంగ్ హీరో నాగ‌శౌర్య, మెహరీన్ జంటగా వస్తోన్న చిత్రం ‘అశ్వథ్థామ’. ఇది నాగశౌర్య సొంత సినిమా. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జ‌న‌వ‌రి 31న సినిమాను విడుద‌ల చేయనున్నారు. చిత్ర ప్రచారంలో భాగంగా శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ‘‘ఎలా ఉంటాడో కూడా తెలియని ఒక రాక్షసుడు. వాడికి మాత్రమే తెలిసిన ఒక రహస్యం. సైరన్ కూతల కింద పనిచేసే వాడి సైన్యం. గమ్యం తెలియని ఒక యుద్ధం. ఆ యుద్ధం గెలవాలంటే ఒక ఆరడుగుల నారాయణ అస్త్రం కావాలి. ఒక అశ్వథ్థాముడు రావాలి’’ అంటూ హీరో పరిచయం గురించి చెప్పే డైలాగ్ అదిరిపోయింది. టీజర్ చూస్తుంటే ఇది కంప్లీట్ యాక్షన్ మూవీ అని అర్థమవుతోంది. నాగశౌర్య మొదటి సారి కంప్లీట్ యాక్షన్ జోనర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కథ కూడా ఆయనే అందించడం విశేషం. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. కాగా, ఈ టీజర్‌ను సమంత అక్కినేని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ‘అశ్వథ్థామ’ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సమంత, నాగశౌర్య ‘ఓ బేబీ’ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZsiTQs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...