Sunday, 15 December 2019

‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. డేటు, ప్లేసు ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు తీపి కబురు. ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారయ్యాయి. సినిమా విడుదలకు సరిగ్గా ఆరు రోజుల ముందు అంటే జనవరి 5న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అత్యంత భారీగా ఈ వేడుకను జరపనున్నారు. ఈ మేరకు ఆదివారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జనవరి 5న సాయంత్రం 5.04 గంటలకు ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభమవుతుంది. మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. పాటలు కూడా బాగున్నాయి. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే షూటింగ్‌ను ముగించి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. Also Read: ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ లేడీ అమితాబ్ విజయశాంతి. సుమారు 13 ఏళ్ల తరవాత ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. మహేష్ సినిమాతో విజయశాంతి రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ ఇమేజ్ కూడా సినిమాకు బాగా కలిసొస్తోంది. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, బండ్ల గణేష్, అజయ్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ‘ఎఫ్2’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36DgIfs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...