తల్లిని దారుణంగా హత్యచేసినందుకు హాలీవుడ్ నటుడు రోన్ ఎలీ కుమారుడిని ఎన్‌కౌంటర్ చేశారు అమెరికన్ పోలీసులు. అక్టోబర్‌లో కెమెరాన్ తన తల్లిని కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్లగా.. వాళ్లను కూడా చంపాలని కెమెరాన్ నిర్ణయించుకున్నాడు. దాంతో పోలీసులు అతన్ని కార్నర్ చేసి వేరే మార్గం లేక రోడ్డు మీదే ఎన్‌కౌంటర్ చేసేశారు. ఆ సమయంలో సీసీటీవీలో రికార్డ్ అయిన ఫుటేజ్ వైరల్ అవుతోంది. కెమెరాన్ తండ్రి రాన్ 1960లో బాగా పాపులర్ అయిన ‘టార్జన్’ అనే టీవీ సిరీస్‌లో నటించాడు. కెమెరాన్ ఎందుకు తన తల్లిని చంపాడు అన్న వివరాలు తెలియరాలేదు. నడిరోడ్డుపై హీరో కొడుకు దారుణంగా ఎన్‌కౌంటర్ చేయడం కాలిఫోర్నియాలో కలకలం రేపింది. అయితే ఈ కెమెరాన్ తన తండ్రిని ఏమీ చేయలేదని, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు హాస్పిటల్‌కు తరలించామని కాలిఫోర్నియా పోలీసులు తెలిపారు. అయితే రాన్ మాత్రం ఈ ఘటనపై మీడియాతో మాట్లాడదలచుకోలేదు. కొడుకు చేతిలో హత్యకు గురైన రాన్ భార్య వాలెరీ లుండీన్ 1981లో మిస్ ఫ్లోరిడాగా కిరీటిం దక్కించుకుంది. తన ముగ్గురు పిల్లల్ని, భర్తను చాలా బాగా చూసుకునేది. అలాంటిది కెమెరాన్ తన తల్లిని ఎందుకు చంపాడో ఇప్పటికీ అర్థంకావడంలేదని చుట్టుపక్కల వారు పోలీసులకు తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OUlWNT
v
No comments:
Post a Comment