Wednesday, 18 December 2019

సరిలేరు నీకెవ్వరు.. ఏది చూపించొద్దు అనుకున్నారో.. అదే లీకైంది!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. దిల్‌ రాజు, అనిల్‌ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. కామెడీ, యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని ఎమోషన్స్‌ ఉండేలా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ప్రతీ సోమవారం ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో లీక్‌ అయ్యింది. మహేష్ బాబు రష్మికలపై ఓ పాట చిత్రీకరణ సందర్భంగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. Also Read: ప్రమోషన్‌లో భాగంగా సినిమాలోని మైండ్‌ బ్లాక్‌ పాటను ముందుగా రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో మహేష్‌ పక్కా మాస్‌ అవతారంలో కనిపిస్తాడని ఆ లుక్‌లో బిగ్‌ స్క్రీన్‌ మీద ఆడియన్స్‌ చూడాలన్న ఉద్దేశంతో లిరికల్ వీడియోలోనూ మహేష్‌ స్టిల్స్‌ను రివీల్ చేయలేదు. అయితే ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన వీడియోనే ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యింది. గళ్ల లుంగీతో డ్యాన్స్‌ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. మహేష్ అభిమానులే ఈ వీడియోనే తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో చిత్రయూనిట్ మహేష్‌కు సంబంధించి ఏ లుక్‌ అయితే దాచి పెట్టాలనుకున్నారో అదే ఇప్పుడు రివీల్‌ అవ్వటంతో అంతా తలపట్టుకున్నారు. ఈ విషయంపై మహేష్‌ కూడా సీరియస్‌ అయినట్టుగా తెలుస్తోంది. Also Read: మహేష్‌ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో విజయశాంతి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. See Photo Story:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34Bez29
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...