Wednesday, 18 December 2019

రూలర్‌ ఇన్‌సైడ్‌ టాక్‌.. పాత చింతకాయ పచ్చడే!

నందమూరి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రూలర్. ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు దారుణంగా ఫెయిల్‌ కావటంతో బాలయ్య అభిమానులు ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. గతంలో బాలయ్య హీరోగా జైసింహా సినిమాకు దర్శకత్వం వహించిన కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సీ కళ్యాణ్‌ నిర్మిస్తున్నాడు. బాలయ్య రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో నటిస్తున్న ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదికలు హీరోయిన్లుగా నటిస్తుండగా జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌, శియాజీ షిండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. డిసెంబర్‌ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read: అయితే నందమూరి అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమాకు టాక్‌ ఆశించిన స్థాయిలో లేదని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా రొటీన్‌ బాలకృష్ణ సినిమాలా ఏ మాత్రం కొత్తదనం లేకుండా సాగుతుందట. యాక్షన్‌, పంచ్‌ డైలాగ్‌లు, హీరోయిన్లతో రొమాన్స్‌ లాంటి అంశాలు అన్నీ గతంలో బాలయ్య సినిమాల్లో చాలా సార్లు చూసినట్టుగానే ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌కు మాత్రమే అంటున్నారు విశ్లేషకులు. See Photo Story: అదే సమయంలో బాలయ్య లుక్‌ విషయంలో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ గెటప్‌లో బాలయ్య విగ్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. మరో లుక్‌ కూడా ఐరన్‌ మ్యాన్‌లా ఉందంటున్నారు ఫ్యాన్స్‌. ఇలా అన్ని రకాలుగా నెగెటివ్‌ టాక్‌ వస్తుండటం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఎన్టీఆర్ బయోపిక్‌ షాక్‌ నుంచి ఇంకా తేరుకోని ఫ్యాన్స్‌ రూలర్‌ సక్సెస్‌ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2sCmoYf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...