Wednesday, 4 December 2019

వామ్మో.. ఫ్యామిలీ హీరో రాంబోలా తయారయ్యాడు!!

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోలు నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. హీరోలు అందంగా కనిపించడానికి మాత్రమే ప్రయత్నించేవారు. సిక్స్ ప్యాక్‌లు అప్పుడు లేవు. కానీ, ఇప్పుడు అలా కాదు. హీరోలు సినిమా కోసం, తమ పాత్రల కోసం ఎంత రిస్క్ అయినా చేస్తున్నారు. ముఖ్యంగా మేకోవర్ విషయంలో అస్సలు రాజీపడటంలేదు. 6 ప్యాక్, 8 ప్యాక్‌లు చేస్తున్నారు. అవసరమైతే భారీగా బరువు పెరుగుతున్నారు.. అలాగే, భారీగా బరువు తగ్గుతున్నారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, రానా, రవితేజ ఎలా ఎంతో మంది హీరోలు ఈ కోవకు చెందినవారే. ఇప్పుడు ఈ జాబితాలో యంగ్ హీరో నాగశౌర్య చేరారు. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య.. ఆ తరవాత అన్నీ ప్రేమకథలు, కుటుంబ కథాచిత్రాలు మాత్రమే చేశారు. అలాగే, ‘కణం’ వంటి థ్రిల్లర్ మూవీలో కూడా నటించారు. అయితే, ఇప్పుడు తొలిసారి పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారాయన. సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో తెరకెక్కుతోంది ఈ సినిమా. టైటిల్ ‘అశ్వథ్థామ’. ఇటీవలే కాన్సెప్ట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాగశౌర్య కల్ట్ లుక్‌కి మంచి మార్కులు పడ్డాయి. Also Read: ఇదిలా ఉంటే, తాజాగా నాగశౌర్య ట్విట్టర్‌లో పెట్టిన ఒక ఫొటో సినిమాపై అంచనాలను బాగా పెంచేస్తోంది. ఈ ఫొటోలో నాగశౌర్య కండలు తిరిగిన బాడీతో రాంబోలా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు చాక్లెట్ బోయ్‌లా, లవర్ బోయ్‌లా కనిపించిన నాగశౌర్య మొదటిసారి రఫ్ అండ్ టఫ్ లుక్‌లో ఆశ్చర్యపరుస్తున్నారు. జిమ్‌లో కసరత్తులు చేసేటప్పుడు తీసిన ఈ ఫొటోను ట్వీట్‌ చేసిన నాగశౌర్య.. ‘‘ఏది రైటో అదే చేయండి, ఈజీగా ఉండేది కాదు’’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. కాగా, ఈ సినిమాలో నాగశౌర్య సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పోసాని కృష్ణముర‌ళి, స‌త్య, విజ‌య‌ ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్కర్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం సమకూరుస్తు్న్నారు. మనోజ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నాగశౌర్య తల్లి ఉషా మల్పూరి నిర్మాత. తండ్రి శంకర్ ప్రసాద్ సమర్పకుడు. ‘ఛ‌లో’, ‘నర్తనశాల’ త‌రువాత ఐరా క్రియేషన్స్ బ్యాన‌ర్‌‌లో నాగశౌర్య చేస్తోన్న సినిమా ఇది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LmtwOR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...