ఆర్‌ఎక్స్ 100 సినిమా ఫేం హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం . మరోసారి బోల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు కార్తికేయ. కార్తికేయ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడు. ఈ సినిమాను కార్తికేయ హోం బ్యానర్‌లో అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. సెన్సార్ సర్టిఫికేట్ రావటంలో ఆలస్యం కారణంగా సినిమా వాయిదా పడిందని వెల్లడించాడు హీరో కార్తికేయ. ఒక్కరోజు ఆలస్యమైన కిక్ మాత్రం తగ్గదంటూ భరోసా ఇస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాలో కార్తికేయ ఆథరైజ్డ్ డ్రింకర్‌గా నటిస్తున్నాడు. తనకున్న ఆరోగ్య సమస్య కారణంగా మూడు పూటలా 90 ఎంఎల్ ఆల్కాహాల్ తీసుకునే పాత్రలో కనిపించనున్నాడు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ పక్కాగా ఉన్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కార్తికేయ ఖాతాలో మరో హిట్‌గా నిలుస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు చిత్రయూనిట్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LoIwvJ
v
No comments:
Post a Comment