Friday, 27 December 2019

ట్వీట్లు పెట్టడం కాదు చిరంజీవి, మహేష్ ఇప్పుడు మాట్లాడరే: శ్వేతారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుపై అల్లర్లు జరుగుతున్నాయి. కొందరు సినీ ప్రముఖులు ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తున్నారు మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై ఎందరో బాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందించారు కానీ టాలీవుడ్‌కి చెందిన ఏ ఒక్క సెలబ్రిటీ స్పందించలేదు. దాంతో టాలీవుడ్ అగ్ర హీరోలైన మహేష్ బాబు, చిరంజీవిలను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు వివాదాస్పద జర్నలిస్ట్ శ్వేతారెడ్డి. ‘‘2019లో మోదీ ప్రభుత్వం తీసుకున్న బెస్ట్ నిర్ణయం పౌరసత్వ సవరణ బిల్లు. దీనికి వ్యతిరేకంగా ఎంత మంది ఎన్ని రకాలుగా కామెంట్స్ చేసినా మోదీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు. ఈ బిల్లుకు మద్దతు తెలపని వారు ఉగ్రవాదులతో సమానం. వారంతా దేశద్రోహులు. ఈ మాట ఎవరో కాదు మన సూపర్‌స్టార్ అంటున్నారు. ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని తప్పు పట్టే హక్కు ఎవ్వరికీ లేదు. ఇలాంటి సందర్భాల్లో తమిళనాడు సెలబ్రిటీల పవర్ కనిపిస్తుంది. సినిమాల విషయంలో కాదు.. ఇలాంటి సందర్భాల్లో స్పందిస్తూ నిజంగా సూపర్‌స్టార్స్ అని నిరూపించుకుంటున్నారు. ఇంత గొడవ జరుగుతున్న ఇప్పటివరకు ఏ ఒక్క టాలీవుడ్ సెలబ్రిటీ అయినా స్పందించాడా?" READ ALSO: " చిరంజీవి కానీ మహేష్ బాబు కానీ ట్వీట్ చేశారా? స్వాతంత్ర్య దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి జాతీయ జెండాను తగిలించుకుని సోషల్ మీడియాలో విషెస్ చెప్పడం కాదు. ఇలాంటి సమయాల్లో స్పందించాలి. వాళ్లు కాదు రజినీకాంతే అసలైన సూపర్‌స్టార్. ఈ బిల్లుపై కామెంట్స్ చేస్తున్నవారికి అసలు ఈ బిల్లు ఏంటో తెలీదని నేను అనుకుంటున్నా. వాళ్లంతా ఓసారి బిల్లులోని అంశాలను పాయింట్ టు పాయింట్ చదివి అప్పుడు మాట్లాడండి’’ అని వెల్లడించారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZCV4FS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...