Monday, 9 December 2019

‘అల వైకుంఠపురములో’ టీజర్.. బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల వైకుంఠపురంలో’. అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు బాగా పాపులర్ అయ్యాయి. సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఆ సమయం ఆసన్నమైంది. అభిమానులను ఓ రేంజ్‌లో అలరించడానికి ‘అల వైకుంఠపురములో’ టీజర్‌ను డిసెంబర్ 11న విడుదల చేస్తున్నారు. అంటే ఇంకో రెండు రోజుల్లో టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. నిజానికి బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ అంచనాలను రెట్టింపు చేయాలంటే టీజర్ కచ్చితంగా బాగుండాలి. ఎందుకంటే ఇప్పటికే ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ వచ్చేసింది. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాబట్టి, దానికి పోటీగా సంక్రాంతికి వస్తోన్న సినిమా ‘అల వైంకుంఠపురములో’ టీజర్‌పై బన్నీ ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. కాగా, ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు. ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తు్న్నారు. జనవరి 12న ఈ చిత్రం విడులకానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38izfza
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...