Thursday, 7 November 2019

Shruti Haasan: అమ్మానాన్న విడిపోయినందుకు సంతోషించా

విలక్షణ నటుడు కమల్ హాసన్ తన మొదటి భార్య సారిక‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు శ్రుతి హాసన్, మరొకరు అక్షర హాసన్. శ్రుతి సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. అక్షర మాత్రం అక్కలా పేరు తెచ్చుకోలేకపోయారు. అయితే తాజాగా తన తల్లిదండ్రులు విడిపోయిన ఘటనపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈరోజు కమల్ హాసన్ 65వ బర్త్‌డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రుతి తన తల్లిదండ్రల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఈ ప్రపంచంలో విడాకులు తీసుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. మా అమ్మానాన్న కూడా విడిపోయారు. వారిద్దరూ సెలబ్రిటీలు కాబట్టి బయటి వారికి ఇది న్యూస్ అవుతంది. కానీ మాకు ఇది న్యూస్ కాదు. వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జీవితంలో సంతోషంగా ఉండే హక్కు ఇద్దరికీ ఉంది. పెళ్లి చేసుకుని వారిద్దరూ సంతోషంగా లేనప్పుడు విడిపోవడమే ఉత్తమం. నాకు తల్లిదండ్రులు కాకముందు వారిద్దరూ మనుషులు. వారు విడిపోయిన కొద్దిరోజులకే నాకు ఈ విషయం అర్థమైంది. ఇద్దరు మనుషులు విడిపోయినప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా పెద్దదాన్ని అయ్యాను. రిలేషన్‌షిప్ సెట్ అవ్వనప్పుడు వదిలేయడమే మంచిది. అంతేకానీ అతకని దానిని బలవంతంగా అతికించాలని చూడకూడదు’ అని వెల్లడించారు. కమల్ హాసన్, సారిక 1988లో పెళ్లి చేసుకున్నారు. 2002లో విడిపోయారు. కమల్‌ని పెళ్లి చేసుకోకముందే సారిక శ్రుతి హాసన్‌కు జన్మనిచ్చారని టాక్. విడాకులు తీసుకున్నాక సారిక తన తల్లి వద్దకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కమల్ హాసన్ ప్రముఖ నటి గౌతమితో డేటింగ్‌ చేశారు. గౌతమికి క్యాన్సర్ వచ్చినప్పుడు కమల్ హాసన్ దగ్గరుండి చూసుకున్నారు. కానీ కొంతకాలం క్రితం వీరిద్దరి మధ్య కూడా మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ కూడా విడిపోయారు. ఇప్పుడు కమల్ హాసన్ కేవలం రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు. మక్కల నీది మయ్యం పేరిట పార్టీ స్థాపించారు. మరోపక్క ‘భారతీయుడు 2’, ‘శెభాష్ నాయుడు’ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NN3q8f
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...