Wednesday, 6 November 2019

నిర్మాతపై ఫైర్‌ అయిన Pawan Kalyan.. కారణం అదేనా?

పవర్‌ స్టార్‌ సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీపై కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ సూపర్‌ హిట్ లూసీఫర్‌ రీమేక్‌లో నటించేందుకు పవన్‌ అంగీకరించినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాకపోవటంతో అంతా కొట్టిపారేశారు. తరువాత పవన్‌ పింక్‌ రీమేక్‌లో నటిస్తున్నట్టుగా బాలీవుడ్ మూవీ ఎనలిస్ట్ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్ చేశారు. తరణ్‌ ఆదర్శ్ లాంటి వ్యక్తి ట్వీట్ చేయటంతో పింక్‌ రీమేక్‌లో పవన్‌ నటించటం దాదాపు ఖాయం అన్న ప్రచారం జరిగింది. అయితే పవన్‌ టీం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తన సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీపై వస్తున్న వార్తలపై పవన్‌ కళ్యాణ్ సీరియస్‌ అయినట్టుగా తెలుస్తోంది. Also Read: తాను ప్రకటించకుండాన పవన్‌ రీఎంట్రీ అన్న వార్తలు వస్తుండంతో నిర్మాత బోనికపూర్‌పై పవన్‌ అసహనం వ్యక్తం చేశారట. హీరోయిన్ల పేర్లు కూడా ఇవే అంటూ మీడియాలో వార్తలు వస్తుంటే మీరు ఎందుకు ఖండించటం లేదంటూ పవన్‌ నిర్మాతపై ఫైర్‌ అయినట్టుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే పవన్‌ నిజంగానే పింక్‌ రీమేక్‌లో నటిస్తున్నాడా లేదా అన్న విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. Also Read: ఇటీవల జరిగిన రాజకీయ సమావేశాల్లో మాత్రం పవన్‌ రీఎంట్రీ ఇచ్చేందుకు సుముఖంగానే ఉన్నట్టుగా హింట్ ఇచ్చారు. ఇతర రాజకీయానాయకులు తమ వ్యక్తిగత బిజినెస్‌లు చేసుకుంటునే రాజకీయాల్లో కొనసాగుతున్నారని, తాను సినిమాలో నటిస్తే తప్పేంటి అన్నట్టుగా మాట్లాడారు. దీంతో పవన్‌ సిల్వర్‌ స్క్రీన్‌ రీఎంట్రీ కన్‌ఫర్మ్‌ అని ఫిక్స్‌ అయ్యారు ఫ్యాన్స్‌. అయితే అది పింక్‌ రీమేక్‌తోనేనా కాదా అన్న విషయం తెలియాల్సి ఉంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NMGczc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...