Tuesday, 5 November 2019

షాకింగ్.. ఆ Saaho కలెక్షన్స్ ఫేక్ అట

ఎన్నో అంచనాల మధ్య యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను నిరాశ పరిచింది. సినిమాకు వచ్చినంత హైప్ కంటెంట్‌లో ఏమీ లేదని అన్నారు. కలెక్షన్ల పరంగా ఎలా ఉన్నప్పటికీ ఆడియన్స్ రేటింగ్ మాత్రం నిరుత్సాహపరిచింది. ఈ సినిమా హిందీలోనే కాదు తమిళం, మలయాళంలోనూ విడుదలైంది. అయితే సాహో హిందీ వెర్షన్ కలెక్షన్లు తప్పని సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్ దాదాపు రూ.143 కోట్లు వసూలు చేసినట్లు మొదట్లో సినీ విశ్లేషకులు తెలిపారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదట. ఫైనల్ రన్‌లో సాహో హిందీ వెర్షన్‌కు వచ్చిన వసూళ్లు రూ.126 కోట్లేనట. దీనిని బట్టి చూస్తే గతంలో చెప్పిన కలెక్షన్స్‌కు 13 శాతం తక్కువ. ఏదేమైనప్పటికీ హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. వారు చూడని యాక్షన్ సినిమాలతో పోలిస్తే సాహోలో ఏమీ లేదు. అయినప్పటికీ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు ఏర్పడిన క్రేజ్ వల్లో ఏమో కానీ సాహో సినిమాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రూ.424 కోట్లు వచ్చాయి. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించారు. జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, నీల్ నితిన్ ముఖేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సాహో సినిమాను బ్లాక్ బస్టర్ చేసినందుకు ప్రభాస్ అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. కానీ ఈ సినిమా ఆడియన్స్‌ ఆశించినంత స్థాయిలో లేదని ప్రభాస్‌కి కూడా అర్థమైంది. అందుకే ఇంకెప్పుడూ ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని ప్రభాస్‌కు తెలిసొచ్చింది. ఇంకెప్పుడూ ఇంతటి భారీ బడ్జెట్‌ సినిమాలు తీయనని చెప్పేశారు. ప్రస్తుతం ఆయన రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్దే కథానాయికగా నటిస్తున్నారు. సినిమాకు ‘జాను’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qsucuq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...