నందమూరి అభిమానులు బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కోసం చాలా కాలం ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు మూడేళ్లుగా తనయుడు ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి. ఒక దశలో బాలయ్య కూడా మరో ఏడాదిలో మోక్షజ్ఞ ఎంట్రీ కన్‌ఫర్మ్ అంటూ అభిమానులను ఊరించాడు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో మోక్షజ్ఞ అతిధి పాత్రలో నటిస్తాడన్న ప్రచారం చాలా గట్టిగా వినిపించింది. అయితే అవన్నీ వట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. తరువాత ఒకటి రెండు సార్లు పబ్లిక్ ఫంక్షన్స్‌లో కనిపించి మోక్షజ్ఞ లుక్ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై అనుమానాలు కలిగించింది. ఇంకా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు పూర్తిగా సిద్ధం కాలేదు. బొద్దుగా కనిపించి అభిమానులను తీవ్రస్ధాయిలో నిరాశపరిచాడు. ఇటీవల బయటకు వచ్చిన నందమూరి వారసుడి ఫోటోలు చూసిన అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో ఉండదని ఫిక్స్ అయ్యారు. Also Read: తాజాగా ఇదే విషయాన్ని బాలయ్య కూడా ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల అభిమానులతో ముచ్చటించిన బాలయ్య మోక్షజ్ఞ తెరంగేట్రానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పాడట. దీంతో నందమూరి వారసుడి ఎంట్రీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఇప్పటికే నందమూరి వారసులుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు దూసుకుపోతున్నారు. Also Read: బాలయ్య జనరేషన్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ల వారసులు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వటమే కాదు స్టార్ స్టేటస్ కూడా అందుకున్నారు. కానీ బాలయ్య వారసుడు మాత్రం ఇంకా తెరంగేట్రానికి సిద్ధం కాలేదు. దీంతో అసలు మోక్షజ్ఞకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా..? లేదా..? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NQMzl8
v
No comments:
Post a Comment