Monday, 25 November 2019

ఆడ డ్రాగన్‌ని వదులుతున్న Ram Gopal Varma.. లెజెండ్‌ ఫ్యాన్స్‌కి పండగే

వివాదాలకు మారు పేరుగా నిలిచిన నుంచి ఓ అద్భుతమైన సినిమా రాబోతోంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాల తర్వాత ఇంకేం షాక్ ఇవ్వబోతున్నారబ్బా అనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఈసారి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌తో సర్‌ప్రైజ్ చేశారు. ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ అనే ఇండో చైనీస్ సినిమాను వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి గతంలో ఎప్పుడూ ప్రకటించలేదు. ఈపాటికే సినిమా షూటింగ్ కూడా మొదలెట్టేసి ట్రైలర్‌ను వదలబోతున్నారు. దీని గురించి తాజగా వర్మ సోషల్ మీడియాలో ప్రకటించారు. ‘నా కెరీర్‌లోనే యాంబీషియస్ సినిమా ఈ ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’. భారతదేశం నుంచి రాబోతున్న తొలి మార్షల్ ఆర్ట్స్ సినిమా. మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్లీ 80వ జయంతి సందర్భంగా నవంబర్ 27న టీజర్‌ను విడుదల చేయబోతున్నా. బ్రూస్లీ యూనివర్సల్ బర్త్ ‌టైం ప్రకారం 3.12కు టీజర్ రిలీజ్ చేస్తాం. ఈ సినిమా ట్రైలర్‌ను బ్రూస్లీ పుట్టిన చైనాలోని ఫోషాన్ సిటీలో డిసెంబర్ 13న రిలీజ్ చేస్తాం’ అని ప్రకటిస్తూ ఈ సినిమాకు సంబంధించని పోస్టర్‌ను షేర్ చేశారు. పోస్టర్‌లో ఈ సినిమాలో టైటిల్ రోల్‌ పోషిస్తున్న హీరోయిన్ బ్రూస్లీ సిగ్నేచర్ స్టైల్‌లో ఫైట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వర్మ బ్రూస్లీకి వీరాభిమాని. ఆ లెజెండ్‌కు వర్మ ఈ సినిమాతో సరైన ట్రిబ్యూట్ ఇవ్వబోతున్నారని అనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2pRJ8m8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...