బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘ఏబీసీడీ: ఎనీబడీ కెన్ డ్యాన్స్’ సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్నారు నటి . అయితే ఆ సినిమా తర్వాత ఆమె మీడియా ముందుకు రావడమే మానేశారు. సినిమాలకు కూడా సంతకం చేయడంలేదు. ఇందుకు కారణం లేకపోలేదంటూ ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొంటున్న సమస్యలను వెల్లడించారు. ‘సోషల్ మీడియాలో నేను నవ్వుతూ ఉన్న ఫొటోలే పోస్ట్ చేశాను. అవి చూసి ఫ్యాన్స్ నేను చాలా సంతోషంగా ఉన్నానని అనుకుంటారు. కానీ ఆ నవ్వు వెనక ఎంతో దుఖం ఉంది. చాలా కాలంగా నేను డిప్రెషన్‌తో బాధపడుతున్నాను. అందుకే మద్యానికి బానిసయ్యాను. నాకు డ్రగ్స్, మద్యంతోనే జీవితం సంతోషంగా గడిచిపోతోంది. అవే నా డిప్రెషన్‌కు మెడిసిన్‌లా పనిచేస్తున్నాయి. నా ఫ్రెండ్ దగ్గర థెరపీ తీసుకోవడానికి న్యూయార్క్ నుంచి లాస్ ఏంజెల్స్ వెళ్లాను. రెండేళ్ల పాటు ఎంతో నరకం అనుభవించాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. నేను బాలీవుడ్‌లోకి రాకముందు ‘స్టెప్ అప్ 4’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. కానీ నా ఫ్రెండ్ కోసం ఆ రోల్ వదులుకున్నాను. ఆ తర్వాత ‘ఏబీసీడీ’లో అవకాశం వచ్చింది’ ‘ఈ సినిమాతో నేను ఇండియానే నా నివాసానికే మార్చుకున్నాను. ఒక్కసారిగా ఫేం వచ్చేయడంతో దాని వలలో పడిపోయాను. ఇండియా నుంచి అమెరికాకు వెళుతున్నప్పుడు ఫ్లైట్‌లో ఎంతో ఏడ్చేదాన్ని. బాలీవుడ్‌ల నాకు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. దాంతో నా బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలిసేది కాదు. నేను ఇతరులతో చాలా నిజాయతీగా ఉండేదాన్ని. కానీ నాతో అందరూ అబద్ధాలు చెబుతుండేవారు. ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్ అన్న ట్యాగ్‌ను నాకు ఇచ్చేశారు. దాంతో నేను ఫెయిల్ అవ్వకూడదని చాలా కష్టపడ్డాను. అయితే ఏబీసీడీ సినిమాలో అమెరికన్ ఇండియన్ డ్యాన్సర్ పాత్రలో నటించాను కానీ నన్ను ప్రమోషన్స్‌కు పిలవలేదు. నన్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. సినిమాలో నా పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా డిలీట్ చేసేశారు. అలా ఆరు నెలల పాటు నరకం అనుభవించాను. ఇప్పుడిప్పుడే చీకటి నుంచి బయటపడుతున్నాను. త్వరలో బాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నాను’ అని తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KQmhi5
v
No comments:
Post a Comment