Monday, 18 November 2019

ఆ హీరోతోనే పెళ్లి అంటున్న Pawan Kalyan హీరోయిన్

తెలుగులో ‘బోణీ’ సినిమాతో బోణీ కొట్టిన నటి . ఓ హీరోయిన్‌కు ఉండాల్సిన గ్లామర్, అందం ఆమెకు ఉన్నా కూడా ఇక్కడ క్లిక్ అవ్వలేకపోయారు. రామ్‌కు జోడీగా ‘ఒంగోలుగిత్తలో’, మంచు మనోజ్‌కు జోడీగా ‘మిస్టర్ నూకయ్య’, పవన్ కళ్యాణ్‌కు జోడీగా ‘తీన్‌మార్’ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో అక్కడికి వెళ్లిపోయారు. అయితే కృతి తాజాగా తన లవ్ లైఫ్‌కు సంబంధించిన విషయాన్ని మీడియా ముందు బయటపెట్టారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు పుల్కిత్ సమ్రాట్‌తో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు కృతి. వీరిద్దరూ జంటగా ‘పాగల్ పంతి’ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. అయితే ఇతర హీరోయిన్స్‌లాగా తన ప్రేమ విషయాన్ని దాచుకోలేదు కృతి. తనకు పుల్కిత్ అంటే ఇష్టమని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది. తాజాగా పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ‘నేను పుల్కిత్ సమ్రాట్ డేటింగ్‌లో ఉన్నామన్న వార్తల్లో ఎంతమాత్రం అబద్ధం లేదు. అవి రూమర్స్ కాదు. నిజాలే. అవును నేను పుల్కిత్ డేటింగ్‌లో ఉన్నాం. నిజాయతీగా చెప్పాలంటే ముందు ఈ విషయం గురించి నా తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నాను. కానీ ప్రతీదానికీ ఓ సమయం ఉంటుంది. ఒక్కోసారి ఇలాంటి విషయాలు బయటపెట్టడానికి ఐదేళ్లు అవ్వచ్చు. లేదంటే ఐదు నెలలు అవ్వచ్చు. మా విషయంలో మాత్రం ఐదు నెలల సమయం పట్టింది. కానీ నేను అతనితో చాలా సంతోషంగా ఉన్నాను. నేను పుల్కిత్‌తో డేటింగ్‌లో ఉన్నానని చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరంలేదు. మా పేరెంట్స్‌కు చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను’ అని వెల్లడించారు. గతంలో వీరిద్దరూ ‘వీకే కీ వెడ్డింగ్’ అనే సినిమాలోనూ నటించారు. అయితే పుల్కిత్‌కు శ్వేతా రోహిరా అనే అమ్మాయితో ఇదివరకే పెళ్లైంది. శ్వేత తండ్రి సల్మాన్ ఖాన్‌ తండ్రి మంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి శ్వేత అంటే సల్మాన్ ఖాన్‌కు చాలా ఇష్టం. కానీ కొన్ని కారణాల వల్ల పుల్కిత్, శ్వేత మూడేళ్ల క్రితం విడిపోయారు. ఇందుకు కారణం నటి యామీ గౌతమేనని, చాలా కాలంగా యామి, పుల్కి్త్ ప్రేమలో ఉండటంతో శ్వేత అతనితో విడిపోయారని వార్తలు కూడా వచ్చాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని యామి స్పష్టం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XpCkZ8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...