Monday, 18 November 2019

సుష్మితా సేన్ బర్త్‌డే స్పెషల్: 2 ఆడపిల్లలు, 11 మంది బాయ్ ఫ్రెండ్స్

బాలీవుడ్ బ్యూటీ ఈరోజు తన 44వ బర్త్‌డే జరుపుకుంటున్నారు. మాజీ మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకుని ఎందరో ప్రేక్షకుల మదిని దోచుకున్న సుష్మిత.. ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. 24 ఏళ్ల వయసులోనే ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్నారు. ఆమె పెళ్లైతే చేసుకోలేదు కానీ చాలా మందితో డేటింగ్ చేశారు. దాదాపు పది మందితో సుష్మిత డేటింగ్ చేశారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కొన్నేళ్ల క్రితం ముంబయిలోని ఓ రెస్టారెంట్ యజమాని అయిన రితిక్ భాసిన్‌తో సుష్మిత డేటింగ్ చేస్తూ కనిపించారు. ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా చేతులు పట్టుకుని వెళుతుండేవారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడాతో కొంతకాలం పాటు సుష్మిత ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ జంటగా ‘కర్మా అండ్ హోలీ’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇతనితోనూ సుష్మిత విడిపోయింది. అనంతరం సెలబ్రిటీ మేనేజర్ అయిన బంటీ సజ్దేతో కొంతకాలం సుష్మిత ప్రేమాయణం నడిపారు. ఇతను సల్మాన్ ఖాన్‌కు మేనేజర్‌గానూ వ్యవహరించాడు. బంటీ ఇతర నటీమణులతోనూ క్లోజ్‌గా ఉంటున్నాడని తెలిసి సుష్మిత అతన్ని దూరం పెట్టేసింది. ఆ తర్వాత సంజయ్ నరంగ్ అనే ఓ రెస్టారెంట్ యజమానితో సుష్మిత ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లేనని సుష్మిత, సంజయ్ విడిపోయాక తెలిసింది. ఆ తర్వాత ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్‌తో కొన్నాళ్లు సుష్మిత డేటింగ్ చేశారు. 1996లో దస్తాక్ అనే సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ఒకర్నొకరు ఇష్టపడ్డారు. అయితే అప్పటికే విక్రమ్‌కు పెళ్లైపోయింది. సుష్మితతో తిరుగుతున్నాడని తెలిసి అతని భార్య విడాకులు ఇచ్చేసింది. ఈ విషయాన్ని విక్రమ్ తన బయోగ్రఫీలో పేర్కొన్నారు. ఆ తర్వాత సుష్మిత హాట్‌మెయిల్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాతో కొంతకాలం డేట్ చేశారు. ఈ బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాత ఇంతియాజ్ ఖత్రి అనే వ్యాపారవేత్తతో సుష్మిత ప్రేమలో పడ్డారు. ఇదీ నిలవలేదు. ఆ తర్వాత మరో బాలీవుడ్ డైరెక్టర్ అయిన ముదస్సర్ అజీజ్‌తో డేటింగ్ చేశారు. 2010లో వచ్చిన ‘దుల్హా మిల్ గయా’ సినిమా షూటింగ్ సమయంలో వీరు ప్రేమించుకున్నారు. సుష్మితను పెళ్లి చేసుకోవాలని ముదస్సర్ ఆమె అపార్ట్‌మెంట్‌కు షిఫ్ట్ అయిపోయారు కూడా. కానీ ఆ బంధం నిలవలేదు. ప్రముఖ పాకిస్థానీ క్రికెటర్ వసీం అక్రమ్‌తోనూ సుష్మిత కొంతకాలం డేట్ చేశారు. అతను పాకిస్థానీ కావడంతో తన కెరీర్‌పై ఎక్కడ ప్రభావం చూపుతుందోనని సుష్మిత అతనికి దూరంగా ఉన్నారు. మిస్ యూనివర్స్ కిరీటం అందుకున్నాక సుష్మిత యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టారు. ఆ సమయంలో దర్శకుడు మానవ్ మేనన్‌తో కొంతకాలం పాటు సుష్మిత డేటింగ్ చేశారు. ఇలా దాదాపు పది మందితో డేటింగ్ చేశారట సుష్మిత. కానీ వారెవ్వరితోనూ ఏ బంధమూ నిలవలేదు. ఈ నేపథ్యంలో 2017లో రోమన్ షాల్ అనే మోడల్‌తో సుష్మితకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి ర్యాంప్ వాక్ కూడా చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చిగురించిన స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇప్పటికీ వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. రోమన్‌ను తాను ప్రేమిస్తున్నానని సుష్మిత అఫీషియల్‌గానూ ప్రకటించేశారు. ఇప్పుడు రోమన్‌తో తన ఇద్దరు ఆడపిల్లలతో సుష్మిత ఎంతో సంతోషంగా ఉన్నారు. కనీసం ఈ బంధమైనా చిరకాలం నిలవాలని ఆశిస్తూ మాజీ మిస్‌యూనివర్స్‌కి మరోసారి హ్యాపీ బర్త్‌డే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OqIwfj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...