Friday, 22 November 2019

Mahesh Babu ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్: బేరాల్లేవమ్మా.. బొమ్మ పగిలిపోయిందంతే

‘ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు.. ఈ సంక్రాంతి మొగుడు వచ్చాడు’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరూ’ టీజర్‌తో దుమ్మురేపుతున్నాడు సూపర్ స్టార్ . అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నుండి పగిలిపోయే టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘మీరు ఎవరో మాకు తెలియదు.. మీకు మాకు ఏ రక్త సంబంధం లేదు.. కాని మీ కోసం మీ పిల్లల కోసం ఎండ వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం ఎందుకంటే మీరు మా బాధ్యత’ అంటూ మహేష్ బాబు డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌లో పంచ్‌లు పటాసుల్లా పేలుతున్నాయి. అనీల్ రావిపూడి పెన్ పవర్‌కు మహేష్ డైలాగ్ డెలివరీ తోడు కావడంతో టీజర్ విజిల్స్ వేయించేదిగా ఉంది. ‘మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలురా.. మిమ్మల్ని ఎలా చంపుకుంటానురా.. మీ కోసం ప్రాణాలను ఇస్తున్నాం రా అక్కడ. మీరేమో కత్తులు గొడ్డలు వేసుకుని ఆడాళ్ల మీద. బాధ్యత ఉండక్కర్లా’ అంటూ మహేష్ చెప్తున్న డైలాగ్ అనీల్ రావిపూడి మార్క్‌లో చాలా ఫన్నీగా ఉంది. ‘భయ పడే వాడే బేరానికి వస్తాడు.. మన దగ్గర బేరాల్లేవమ్మా’ అని మహేష్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌కు విజిల్స్ వేయించేదిగా ఉంది. ‘గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్’ అంటూ విజయశాంతి సైతం డైలాగ్‌తో అదరగొట్టేసింది. See Photo Story: మహేశ్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్, F2 లాంటి వరుస బ్లాక్ బస్టర్ అందుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు టీజర్‌తో రెట్టింపు చేసింది చిత్ర యూనిట్. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చగా.. అదితీ రావు, రష్మిక హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు .


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XEFI2I
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...