Wednesday, 20 November 2019

Jr Ntr: ఎన్టీఆర్‌కు జోడిగా లండన్‌ బ్యూటీ.. సస్పెన్స్‌కు తెరదించిన ఆర్ఆర్ఆర్‌ టీం

బాహుబలి తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్ఆర్‌. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ నటిస్తోంది. అయితే సినిమా తొలి ప్రెస్‌ మీట్‌లో ఎన్టీఆర్‌కు జోడి డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ అనే హాలీవుడ్‌ భామ నటిస్తున్నట్టుగా ప్రకటించాడు రాజమౌళి. కానీ అనివార్య కారణాలతో డైసీ ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి ఎన్టీఆర్‌కు సరైన జోడిని వెతికే పనిలో ఉంది రాజమౌళి టీం. ఒకపక్క షూటింగ్ పనులు కానిచ్చేస్తూనే మరో పక్క హీరోయిన్‌ కోసం వేట కొనసాగించింది. ఫైనల్‌గా ఎన్టీఆర్‌కు సరైన జోడిని వెతికి పట్టుకున్నారు ఆర్ఆర్ఆర్‌ టీం. ఈ రోజు ఆమె ఫోటోతో పాటు క్యారెక్టర్‌ పేరు అధికారికంగా ప్రకటించారు. లండన్‌కు చెందిన ఓలివియా మోరీస్‌ను ఎన్టీఆర్‌కు జోడిగా జెన్నీఫర్‌ పాత్రకు ఫైనల్‌ చేసినట్టుగా అధికారికంగా ప్రకటించారు. థియేటర్‌ ఆర్టిస్ట్‌ అయిన ఓలివియా పలు టీవీ షోస్‌లోనూ నటించింది. ఈమె ఆర్‌ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌ సరసన నటిస్తోంది. Also Read: విలన్‌గా ఐరిష్ యాక్టర్‌ రే స్టీవెన్సన్‌ నటిస్తున్నట్టుగా ప్రకటించారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో రే బ్రిటీష్ అధికారి స్కాట్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రఖ్యాత థార్‌ సిరీస్‌లో నటించిన రే స్టీవెన్సన్‌.. పలు టెలివిజన్‌ షోస్‌లో కీలక పాత్రల్లో నటించాడు. తొలిసారిగా ఓ రీజినల్ సినిమాలో నటించేందుకు అంగీకరించాడు రే. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం వరకు పూర్తయింది. ఎన్టీఆర్‌ కొమరం భీంగా, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. బాహుబలి తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. Also Read: అందుకు తగ్గట్టుగా భారీ తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో నటిస్తుండగా తమిళ నటుడు సముద్రఖని మరో పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 జూలై 30 ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37oUIGk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...