Monday, 18 November 2019

ఇది నా జీవితంలో మెమరబుల్‌ ఎక్స్‌పీరియన్స్‌: మురుగదాస్‌

సూపర్ స్టార్ రజినీకాంత్, సౌత్‌ స్టార్ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ల క్రేజి కాంబినేష‌న్‌లో తొలిసారిగా రూపొందుతున్న సినిమా `దర్బార్`. కోలీవుడ్ వరుసగా భారీ చిత్రాలను తెరకెక్కిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజనీ ప‌వ‌ర్‌ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. సౌత్‌ యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా మోషన్ పోస్టర్‌కి ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సూపర్ స్టార్ రజని నవంబర్ 14న డబ్బింగ్ స్టార్ట్ చేసి 18వ తారీఖున పూర్తి చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. Also Read: ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ మాట్లాడుతూ, `సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో దర్బార్ సినిమా చేయడం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. అలాగే ఆయనతో చేసిన ఈ డబ్బింగ్ సెషన్ నా లైఫ్ లోనే మెమొరబుల్` అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటిస్తున్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Also Read: ఇటీవల రాజకీయరంగం ప్రవేశంతో రజనీ సినిమాలకు దూరమవుతారన్న ప్రచారం జరిగింది. అయితే రజనీ మాత్రం పొలిటికల్‌ ఎనౌన్స్‌మెంట్‌ తరువాత సినిమాల స్పీడు పెంచాడు. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది రెండు సినిమాలు విడుదల చేసిన సూపర్‌ స్టార్‌ ఈ ఏడాది పేట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2020 ఆరంభంలోనే దర్బార్‌తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/331Dmf2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...