Tuesday, 19 November 2019

`జార్జ్‌ రెడ్డి` మీద మెగా ఫ్యామిలీకి అంత ప్రేమేంటి..?

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎన్నో పోరాటలు చేసి అతి చిన్న వయసులోనే హత్యకు గురైన లీడర్‌ జార్జ్‌ రెడ్డి. ఇప్పుడు ఇదే కథతో ఓ సినిమా తెరకెక్కింది. వంగవీటి ఫేం సందీప్‌ మాధవ్‌ హీరోగా దళం ఫేం జీవన్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా శుక్రవారం (22-11-2019) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి అనూహ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను నెక్లెస్‌ రోడ్‌లో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఈ వేడుకకు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరవ్వాల్సి ఉంది. అయితే పవన్‌ వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో ఈ వేడుకను వాయిదా వేశారు. త్వరలో మరో వేదికలో ఈ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. Also Read: ఇక మెగా బ్రదర్‌ నాగబాబు కూడా జార్జ్‌ రెడ్డికి మద్దతు తెలిపాడు. చిత్రయూనిట్‌ను అభినందిస్తూ ఓ వీడియో మెసేజ్‌ను కూడా విడుదల చేశాడు నాగబాబు. అంతేకాదు జార్జ్‌ రెడ్డి.. పవన్‌ కళ్యాణ్ మధ్య పోలికలున్నాయంటూ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచే ప్రయత్నం చేశాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా జార్జ్‌ రెడ్డికి తనవంతు సాయమందించాడు. ఈ సినిమాలోని అడుగు అడుగు అనే పాటను మెగా స్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ఈ సందర్భంగా తనను కలిసి చిత్రయూనిట్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్‌ చిరంజీవి. ఇలా మెగా హీరోలు ఒక్కొక్కరుగా జార్జ్‌ రెడ్డికి మద్దతు తెలుపుతుండటంతో జార్జ్‌ రెడ్డి పై మెగా ఫ్యామిలీకి ఎందుకింత ప్రేమ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Also Read: 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్‌ లీడర్‌ జార్జ్‌ రెడ్డి. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో వంగవీటి ఫేమ్‌ సందీప్‌ మాధవ్‌ (సాండి) నటిస్తున్నాడు. దళం మూవీ ఫేం జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్‌ సినిమా బ్యానర్లతో కలిసి మైక్‌ మూవీస్‌ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 22న విడుదల కానుంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2pA5vfK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...