Monday, 4 November 2019

‘సెక్స్ అడిగితే బెగ్గర్ అంటారు, నేనే చేస్తే రేపిస్ట్ అంటారు’

అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చకున్న యువ నటుడు . కార్తిక్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పతి పత్నీ ఔర్ వో’. భూమి పెడ్నేకర్ కార్తిక్ భార్య పాత్రలో అనన్య పాండే ప్రేయసి పాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్‌లో కార్తిక్ అభినవ్ త్యాగి అనే ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించాడు. భూమి అతని భార్యగా కనిపించారు. ఇతను పనిచేస్తున్న ఆఫీస్‌లోనే ఉద్యోగిగా వస్తుంది అనన్య పాండే. సినిమాలో ఈమె పాత్ర పేరు తపస్య పాత్రలో నటించారు. ఇంట్లో ఇల్లాలిని ప్రేమిస్తూనే ఆఫీస్‌లో తపస్యను లైన్‌లో పెడతాడు అభినవ్. అటు ఇంట్లో భార్య వద్ద అబద్ధాలు చెప్పలేక గర్ల్‌ఫ్రెండ్ దగ్గర పెళ్లైందన్న నిజం చెప్పలేక అభినవ్ అష్టకష్టాలు పడుతుంటాడు. ట్రైలర్‌లో సెక్స్‌కు సంబంధించిన అభినవ్ చెప్పే ఓ భారీ డైలాగ్ ఉంది. ‘భార్య దగ్గరకు వెళ్లి సెక్స్ అడిగితే బెగ్గర్ అంటారు. సెక్స్ చేయకపోతే నేరం అంటారు. నేనే ఏదోలా నా భార్యను మాటల్లో పెట్టి సెక్స్ చేద్దామంటే రేపిస్ట్ అంటారు’ అని ఇప్పటివరకు వాట్సాప్‌లో బాగా వైరల్ అయిన డైలాగ్‌ను ఇందులో వాడారు. ఈ డైలాగ్ ఇప్పటివరకు చాలా మంది వినేసుంటారు. 1978లో ఇదే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది. ఇప్పుడు మళ్లీ న్యూ ఏజ్ కామెడీగా ఈ సినిమాను ఇదే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ట్రైలర్‌లో ఇల్లాలి పాత్రలో భూమి ఆకట్టుకున్నారు. ఇక ప్రియురాలి పాత్రలో నటించిన అనన్య చాలా సెక్సీగా బ్యూటిఫుల్‌గా కనిపించారు. అనన్యకు ఇది రెండో సినిమా. ఇదే ఏడాదిలో విడుదలైన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య. ఈ సినిమా హిట్ అవ్వలేదు కానీ అనన్యకు మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆమె అందానికి ప్రేక్షకులు పడిపోయారు. ‘పతి పత్ని ఔర్ వో’ సినిమాకు ముదస్సర్ అజీజ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qnxEq9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...