Monday, 4 November 2019

ఆయన కన్నా నేనే క్యూట్: రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు అయిన రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. ఆమె చేసే పోస్టులన్నీ తనకు, తన పిల్లలకు సంబంధించినవే ఉంటాయి. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత పిల్లలతో కలిసి పుణే వెళ్లిపోయిన రేణు దేశాయ్ అక్కడ సంతోషకర జీవితాన్ని గడుపుతున్నారు. ఇటీవలే ఆమె ఒంటరిగా మాల్దీవులు విహారయాత్రకు కూడా వెళ్లొచ్చారు. అక్కడ తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే, తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. ఇది ఒక వీడియో. ఈ వీడియోలో రేణు దేశాయ్ ఐరన్ మ్యాన్ గ్లోవ్‌ని చేతికి తొడుక్కుని ఉన్నారు. ఆ గ్లోవ్‌ను ఐరన్ మ్యాన్ మాదిరిగానే ఆడిస్తూ కెమెరాకు చూపించారు. రేణు వెనుక నుంచి ఆమె కుమార్తె ఆధ్య స్లో మోషన్‌లో గంతులేస్తూ వెళ్లింది. ఈ పోస్ట్‌కు ఆసక్తికర కోట్ కూడా పెట్టారు రేణు. ‘‘నేను ఐరన్ మ్యాన్. ఈ వీడియో నాకెంతగానో నచ్చింది. ఆధ్య ఫొటోబాంబింగ్ ఎంత బాగుందో. రాబర్ట్ డౌనీ జూనియర్ కన్నా కచ్చితంగా నేను క్యూటర్ ఐరన్ మ్యాన్’’ రేణు పేర్కొన్నారు. Also Read: మార్వెల్ సూపర్ హీరోస్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఐరన్ మ్యాన్ అంటే పడిచచ్చిపోతారు. ‘అవెంజర్స్: ది ఎండ్ గేమ్’ క్లైమాక్స్‌లో ఐరన్ మ్యాన్ చనిపోయినప్పుడు ఎంతో మంది అభిమానులు బోరున విలపించారు. అంత పిచ్చి ఆయనంటే. ఇప్పుడు ఐరన్ మ్యాన్‌పై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు రేణు. అంతేకాదు, ఆయనకంటే తానే క్యూట్‌గా ఉన్నానని మురిసిపోయారు. అయితే, రేణు పోస్ట్‌కు అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఐరన్ మ్యాన్ కాదు.. ఐరన్ ఉమెన్ అంటూ పొగిడేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36v2oGt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...