Tuesday, 19 November 2019

గర్భిణి అని చూడకుండా నా భర్త వదిలేసిపోయాడు: నటి

గర్భిణి అని కూడా చూడకుండా తనను వదిలేసి వెళ్లిపోయాడని భర్తపై ఆరోపణలు చేస్తోంది హాలీవుడ్ నటి . 35 ఏళ్ల ప్రిన్సెస్‌ సింగర్ రేజేను పెళ్లి చేసుకుంది. వీరికి 17 నెలల కూతురు ఉంది. ప్రస్తుతం ప్రిన్సెస్ ఎనిమిది నెలల గర్భిణి. అయితే నవంబర్ 17న లాస్ వెగాస్‌లో జరిగిన బెట్ సౌల్ ట్రెయిన్ అవార్డ్స్ వేడుకకు ప్రిన్సెస్‌‌ని కూతురిని తీసుకుని వెళ్లాడు రేజే. షో అయిపోయాక రేజే భార్యాపిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడట. దాంతో ప్రిన్సెస్ తన కూతురితో లాస్ వెగాస్‌లోనే ఉండిపోయింది. ఇంతటి నీచమైన భర్తను నేనెక్కడా చూడలేదంటూ ఈ విషయాన్ని ప్రిన్సెస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘గర్భిణి అని కూడా చూడకుండా నన్ను, నా కూతురిని వదిలేసి వెళ్లిపోయాడు. ఫోన్ చేస్తే నెంబర్ బ్లాక్‌లో పెట్టేశాడు. ఇంతటి అసహ్యమైన వ్యక్తికి గుడ్ బై చెప్పకపోతే బాగోదు. నేను నా బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్లగలను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ నేను కారును నడపలేను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎనిమిది నెలలు. కారు మధ్యలో ఆగిపోతే డీజిల్ పోయించుకోవడానికి గ్యాస్ కొట్టించుకోవడానికి ఆపలేను. ఈ సమయంలో కారు నడిపితే పురిటి నొప్పులు వస్తాయి. అవన్నీ నేను భరించలేను. కాబట్టి ఓ డ్రైవర్‌ని మాట్లాడుకుని వెళ్తాను’ అని తెలిపింది. అయితే ప్రిన్సెస్ చేస్తున్న ఆరోపణలపై రేజే ఏమీ స్పందించలేదు. అయితే అవార్డ్స్ షోలో వీరిద్దరూ కౌగిలించుకుంటూ ఫొటోలకు పోజులిస్తూ కనిపించారు. ఇంతలో ఏం జరిగిందో వారికే తెలియాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KF2ySj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...