Monday, 4 November 2019

54 ఏళ్ల నటుడు.. పిచ్చెక్కిస్తున్నాడంటున్న లేడీ ఫ్యాన్స్

పుట్టుకతో వచ్చింది చచ్చేదాకా పోదు అని ‘నరసింహ’ సినిమాలో సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పినట్లు.. కొందరికి అందం పుట్టుకతోనే వస్తుంది. ఏళ్లు గడిచే కొద్ది వారి అందం రెట్టింపవుతూనే ఉంటుంది. ఇందుకు నిదర్శనం బాలీవుడ్ నటుడు, మోడల్ . ఇప్పుడు ఆయన వయసు 53. ఇటీవల 54వ బర్త్‌డే జరుపుకున్నారు. బర్త్‌డే సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశారు. సముద్రంలో చొక్కా లేకుండా దిగిన ఫొటో అది. ఈ ఫొటోను మిలింద్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే లైక్‌లు, కామెంట్లతో మారుమోగిపోయింది. ‘మీరే నా ఫస్ట్ క్రష్, ఇంత హ్యాండ్సమ్‌గా ఎలా ఉంటున్నారు? మీ అందంతో పిచ్చెక్కిస్తున్నారు, మేడమ్ టుస్సాడ్స్‌లో ఇదే పోజ్‌తో మైనపు విగ్రహాన్ని తయారుచేయించుకోండి’ అంటూ తెగ కామెంట్లు పెట్టారు. ఈ వయసులోనూ మిలింద్ దాదాపు 30 కిలోమీటర్ల వరకు ఆపకుండా మ్యారథాన్ చేయగలరు. పుషప్స్ కూడా చేయగలరు. కుర్రాళ్లు కూడా ఆయన ముందు బలాదూరనే చెప్పాలి. మిలిందే కాదు ఆయన తల్లి ఉషా వయసు 90 ఏళ్లు. ఇప్పటికీ ఆమె తన కుమారుడితో కలిసి రన్నింగ్ చేస్తారు. మిలింద్‌‌ ఫిట్‌నెస్ పరంగా ఎందరికో రోల్ మోడల్. కానీ ఎప్పుడైతే తనకంటే 20 ఏళ్లు చిన్నదైన అంకితా కోన్వార్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారో హేటర్స్ కూడా ఎక్కువయ్యారు. కూతురి వయసున్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావ్ అని చాలా మంది తిట్టారు. కానీ సమాజం కోసం తన ప్రేమను వదులుకోలేనని మిలింద్ చాలా సార్లు వెల్లడించారు. మిలింద్ సోమన్ మన తెలుగువారికి అంతగా సుపరిచితులు కాకపోవచ్చు. ప్రముఖ తమిళ నటుడు కార్తి నటించిన ‘ఆవారా’ సినిమాలో మిలింద్ విలన్ పాత్రలో నటించారు. 2009లో ప్రముఖ నటుడు రాజశేఖర్ నటించిన ‘సత్యమేవ జయతే’ సినిమాలోనూ మిలింద్ నటించారు. అయితే ఆయన హిందీ, తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NfTo0q
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...