Monday, 7 October 2019

SyeRaa కలెక్షన్స్: ఆదివారం అదే దూకుడు.. సైరా ఆగడు

మెగాస్టార్ హీరోగా మెగా పవర్ స్టార్ నిర్మించిన నరసింహారెడ్డి వీరవిహారం కొనసాగుతుంది. పాన్ ఇండియా సినిమా అన్న హోదాలో ఫెయిల్ అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దుమ్ములేపుతుంది. చిరంజీవి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్, సురేందర్ రెడ్డి టేకింగ్, అద్భుత తారాగణం, కళ్ళు చెదిరే విజువల్ గ్రాండియర్ ప్లస్ పాయింట్స్‌గా దూసుకుపోతుంది సైరా. బుధవారం రోజు రిలీజ్ అయిన సైరా శుక్రవారం మాత్రం కాస్త తగ్గినట్టు అనిపించింది. కానీ మళ్ళీ శనివారం నుండి మాత్రం బాగా పుంజుకుంది. ఇక ఆదివారం అయితే ఈ సినిమా గ్రోత్ అందరికి షాకిచ్చింది. ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 9 నుండి 10 కోట్ల మేర షేర్ రాబట్టింది. సినిమా రిలీజ్ అయిన ఐదో రోజు ఆ రేంజ్ డిస్ట్రిబ్యూటర్ షేర్ అంటే మామూలు విషయం కాదు. Also Read: ఇప్పటికే సైరా అనేక రికార్డ్స్‌ని బ్రేక్ చేసింది. అయితే మొటివారంతానికి 80 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించే దిశగా సాగుతుంది. ప్రస్తుతం 70 కోట్ల మేర డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టిన సైరా సోమ, మంగళవారాల్లో మరొక 10 కోట్ల షేర్ కలెక్ట్ చెయ్యడం అనేది చాలా సునాయాసమయిన టాస్క్. అసలే దసరా హాలిడేస్ ఉన్నాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ దూకుడుకి అడ్డు ఉండదు అనేది ఫ్యాక్ట్. Also Read: ఇక మెగా ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో సైరా కలెక్షన్స్ సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. అక్కడ ఈ రెండురోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కి రీచ్ అయిపోతుంది. అలాగే ఓవర్సీస్‌లో కూడా సైరా పరుగు కొనసాగుతుంది. ముందు స్లోగా స్టార్ట్ అయిన సైరా డ్రీమ్ రన్ వీకెండ్‌లో మాత్రం అనుకున్నట్టుగానే ఊపందుకుంది. దీంతో అక్కడ కూడా ఆదివారానికి 2 మిలియన్ డాలర్స్ మార్క్ టచ్ చేసింది. అయితే అక్కడ ఇంకొక వారం పాటు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టాల్సిన అవసరం ఉంది.అప్పుడే అక్కడ సినిమా కొనుకున్నవాళ్ళు నష్టపోకుండా ఉంటారు. Also Read: సైరా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా బాగానే చేసారు. కాకపోతే గతంలోనే బాహుబలిలో పీక్ స్టేజ్ గ్రాండియర్ చూసిన అక్కడి ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా అనలేదు. పైగా ఈ మధ్య కాలంలోనే మణికర్ణిక లాంటి సినిమా రావడం కూడా సైరా కలెక్షన్స్‌ని ప్రభావితం చేసింది అని అక్కడి ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ నుండి పోటీ ఉంది అని తెలిసినా కూడా రిలీజ్ చేసారు. అందుకే వార్ ఎఫెక్ట్ కూడా సైరా పై పడింది. అలాగే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా సైరా వసూళ్లు డల్ గానే ఉన్నాయి. అయితే కర్ణాటక వసూళ్లు మాత్రం చాలా షాకింగ్‌గా ఉన్నాయి.అయితే తెలుగు రాష్ట్రాలవరకు ఈ సినిమా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తుండడం, నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా భారీగా రావడంతో ఈ సినిమా సేఫ్ వెంచర్‌గా నిలిచే అవకాశాలయితే ఉన్నాయి.మరి సైరా ఫైనల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది వేచి చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31OT65r
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...