Monday, 7 October 2019

దసరా పండగ... సినిమా పబ్లిసిటీ నిండుగా

'విజయదశమి' పేరులోనే ఉంది విజయం. ఆ పండుగ రోజు ఏ పని చేసినా గెలుపు తలుపు తడుతుందని జనాల విశ్వాసం. ఇలాంటి అవకాశాన్ని తెలుగు ఇండ్రస్టీ మాత్రం ఎందుకు వదులుకుంటుంది చెప్పండి. ఇలా సెంటిమెంట్‌ను ఫాలో అవుతూనే ఉంటుంది చిత్ర పరిశ్రమ. అందుకే ఈ దసరా సందర్భంగా రకారకాల ప్రమోషనల్ మెటీరియల్ తో ప్రేక్షకుల్ని అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి..నిర్మాణ సంస్థలు. విజయదశమి రోజు ఓ పోస్టరో.. వీడియోనో...ఏ ఫస్ట్‌లుక్‌ ఫొటోనో రిలీజ్ చేసి... లక్‌ తోకను తాము తొక్కేయాలని ఉబలాటపడుపడుతున్నారు. మరి ఈ దసరా ప్రమోషన్ల రేసులో ఏయే చిత్రాలున్నాయో ఓ లుక్కేద్దామా..! సంక్రాంతి పోటీకీ రెడీ అవుతున్న రెండు భారీ చిత్రాలు 'సరిలేరు నీకెవ్వరు, '. అనిల్ రావిపూడి దర్శకత్వంలో భారీ అంచనాలతో మహేష్ బాబుతో తెరకెక్కుతున్న '' 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాపై ప్రిన్స్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వారికి దసరా నాడు సర్‌ఫ్రైజ్ ప్లాన్ చేసింది చిత్ర బృందం. రేపు పోస్టర్ రిలీజ్ చేసే అవకాశమున్నట్లు సమాచారం. Also Read: 'సామజవరగమన' అంటూ సగటు సినీ అభిమానిని సైతం తన వైపుకు తిప్పుకున్న చిత్రం 'అల వైకుంఠపురములో'. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డమ్‌.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇమేజ్ వల్ల ఈ సినిమాపై అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. ఇప్పటికే లిరికల్ సాంగ్ విడుదల చేసిన..టీమ్ ప్రమోషన్ స్పీడ్ పెంచేసింది. విజయదశమి రోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. Also Read: ముచ్చటగా మూడో సర్‌ఫ్రైజ్ కూడా ఉందండోయ్. అదీ బాలయ్య 105వ చిత్రం నుంచి. కే.యస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి నందమూరి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలే ఈ మూవీలో బాలయ్య మేకోవర్ ఓ రేంజ్‌లో ఉంది. యంగ్ లుక్‌లో బాలకృష్ణ సూపర్ అనిపించుకున్నాడు. ఈ చిత్రంలో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే దసరా మ్యాజిక్‌ను చేజిక్కుంచుకుందామని చూస్తోంది సినిమా యూనిట్. రేపు బాలయ్య 105 చిత్రానికి టైటిల్ ప్రకటించే అవకాశముంది. 'రూలర్' అనే పేరు ఫైనల్ చేస్తారని సినీ వర్గాల సమాచారం. Also Read: అలాగే వెంకటేష్ - నాగచైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వెంకీమామ' టీమ్ దసరా సెంటిమెంట్‌ను ఫాలో అయిపోతుంది. రేపు విజయదశమి సందర్భంగా ఓ టీజర్ అందిచనుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఓ పోస్టర్‌ అందరిని ఆకట్టుకుంటోంది. దీంతో రేపు రాబోయే టీజర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 'చిత్రలహరి' సినిమాతో హిట్ కొట్టిన హీరో సాయి ధరమ్‌ తేజ్ అదే ఊపులో కొత్త సినిమాకు ముహుర్తం పెట్టేశాడు. నూతన దర్శకుడు సుబ్బుతో సోలో బ్రతుకే సో బెటర్ అంటూ పూజా కార్యక్రమాలు కూడా చేసేశాడు. టైటిల్ లోగో కూడా చూపించేశారు. విజయదశమి సెంటిమెంట్‌ ఈ 'విన్నర్' హీరోకు ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరి. ఇంకా అడవి సాయి కిరణ్ సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ట్రైలర్ కూడా రేపే రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ విజయాల పండుగ విజయదశమి సెంటిమెంట్ ఎన్ని సినిమాలకు విజయాన్ని అందించనుందో వేచి చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30VLrAW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...