మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక మూవీ ‘సైరా’ భారీ అంచనాల నడుమ రేపు (అక్టోబర్ 2) థియేటర్స్‌లో విడుదల కానుండటంతో మెగా సంబరాలు దేశ వ్యాప్తంగా మొదలయ్యాయి. మెగాస్టార్ కలల ప్రాజెక్ట్‌ను మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్ సుమారు రూ. 270 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించడంతో పాటు.. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ ఉడ్‌లకు సంబంధించిన స్టార్లు.. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క శెట్టి వంటి హేమాహేమీలు ఈ చిత్రంలో నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. Read Also: తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా ‘సైరా’ను హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రాన్ని యూనిట్ సభ్యులతో పాటు.. యుఎస్, దుబాయ్‌లలో పలుచోట్ల ప్రదర్శించగా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ట్వీట్ల జోరందుకుంది. ఇక మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్.. ‘సైరా’ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చి.. పార్టీ ఎప్పుడు ఎక్కడ? అని కొనిదెల ప్రొడక్షన్స్‌ని ట్యాగ్ చేసి రామ్ చరణ్‌ని పార్టీ అడుగుతున్నాడు. అంతే కాదు బాక్సాఫీస్ వద్ద సత్తాచూపిస్తున్నట్టుగా ఉన్న కండలు ఉన్న ఎమోజీని షేర్ చేసి మోగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చారు సాయి ధరమ్. ఒక వైపు సినిమా ఎలా ఉంటుందోనని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి బ్లాక్ బస్టర్ హిట్ అంటూ రిలీఫ్ ఇచ్చారు సాయి ధరమ్. చూడాలి మరి ఈ మెగా మేనళ్లుడు మాటలు నిజమో కాదో.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2p2EtwN
v
No comments:
Post a Comment