Tuesday, 1 October 2019

సైరా సినిమా ఆస్కార్ అందుకోవాలి...అదే అన్నయ్య కోరిక

సైరా సినిమా గురించి ప్రతిఒక్కరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా హిట్ అనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ చారిత్రాత్మక సినిమా కలెక్షన్స్ పరంగా అద్భుతం అనిపించే కలెక్షన్స్ కురిపించడం ఖాయం. అయితే ఈ సినిమా కథా రచయితల్లో ఒకరయిన పరుచూరి గోపాలకృష్ణ మాత్రం తన మాటలతో ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు. Also Read: ఈ సినిమాకి డైలాగ్స్ రాయమని సురేందర్ రెడ్డి అడగడంతో ముందు పరుచూరి గోపాకృష్ణ ఫస్ట్ వెర్షన్ రాశారట, పరుచూరి వెంకటేశ్వరరావు సెకండ్ వెర్షన్ రాసి చిరంజీవి గారికి రీడింగ్ ఇవ్వడం జరిగిందట. ఆ టైమ్‌లో అక్కడ ఉన్న వినాయక్ 'చిరంజీవి గారు ఫస్ట్ హాఫ్ ఉన్నది ఉన్నట్టుగా తీసెయ్యొచ్చు, సెకండ్ హాఫ్ కాస్త మార్పులు చేర్పులు చెయ్యాల్సి ఉంటుంది' అని అన్నారట. అంటే ఈ సినిమా డైలాగ్స్ స్టేజ్‌లోనే అలా ఉందంటే ఫైనల్ అవుట్ ఎలా ఉండి ఉంటుంది అనేది అర్ధం చేసుకోవచ్చు. Also Read: ఆ సినిమా మొత్తం స్క్రిప్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఒక మాట చెప్పారట గోపాకృష్ణ. ''ఈ సినిమాకు చిరంజీవి గారు మీరు, సురేందర్ రెడ్డి గారు కృష్ణార్జునులు.మీరు ఎవరి సాయం తీసుకుంటారో మీ ఇష్టం. కానీ ఈ సినిమా మాత్రం చరిత్ర సృష్టించాలి. దాన్ని మీరు ఎన్ని మార్పులు చేసుకున్నా పర్లేదు. కానీ అన్నయ్య(పరుచూరి వెంకటేశ్వరరావు) చెప్పినట్టు ఈ సినిమా ఆస్కార్‌కి వెళ్ళాలి '' అని చెప్పారట. పరుచూరి వెంకటేశ్వరరావు అన్ని సినిమాలు రాసిన అనుభవంతో ఈ సినిమా ఆస్కార్ రేంజ్ అని చెబుతూనే ఉన్నారంటే అవుట్ ఫుట్ కూడా అదే రేంజ్‌లో ఉండి ఉంటుంది అనే అభిప్రాయం అందరిలో ఉంది. Also Read: ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ముందే ఈ సినిమా ఫైనల్ వెర్షన్ చూసుకున్నారట చిరంజీవి. ఆయనతో పాటే రచయితల టీమ్ కూడా ఈ సినిమా చూసిందట. ఈ సినిమా చూసిన చిరంజీవి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారట. చిరంజీవి సినిమాల విషయంలో నాలెడ్జ్‌కి, జడ్జిమెంట్‌కి ఇండస్ట్రీలో చాలా వాల్యూ ఉంది, ఆయన మాట పై నమ్మకం ఉంది. అందుకే ఆ సినిమా గురించి అంతా అంతలా మాట్లాడుతున్నారు. ఇక రేపు ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోంది అనేది ప్రేక్షకులు చెబుతారు. పరుచూరి ఆశపడినట్టు, అభిప్రాయ పడినట్టు ఈ సినిమా ఆస్కార్ కి వెళితే అది మన తెలుగు సినిమాకి ఖచ్చితంగా ఒక ప్రౌడ్ మూమెంట్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2oUL6RJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...