ఈమెకు ఇదేం ఆనందమో తెలియదు కాని.. ఆధారాలు లేని ఆరోపణలతో ఎదుటి వారిపై బురదజల్లడమే పనిగా పెట్టుకుంది . చీకటి బాగోతాలు అంటూ సమాజంలో ఒక హోదాలో ప్రజల మధ్య గౌరవంగా బతుకుతున్న వారి జీవితాలను రోడ్డుకి ఈడ్చే ప్రయత్నాన్ని విరమించుకోవడం లేదు ఈ వివాదాస్పదన నటి. సమయం, సందర్భం లేకుండా తనకు సంబంధంలేని విషయాల్లో వేలుపెట్టి మరీ వారి బతుకులను బజారుకీడ్చే ప్రయత్నం చేస్తుంది. అర్ధనగ్న ప్రదర్శనతో ఇండస్ట్రీ పరువును జాతీయ స్థాయిలో బజారుకు లాగిన శ్రీరెడ్డి.. తన అర్ధరహిత ఆరోపణలతో మరోసారి చెలరేగింది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ హీరోయిన్ రోజాపై దారుణమైన కామెంట్స్ చేసింది. బుధవారం నాడు తన ఫేస్ బుక్‌లో దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఒక నటితో ఎఫైర్ ఉందంటూ ఆ నటిపై దారుణమైన ఆరోపణలు చేసింది. సదరు నటి భర్తను సైతం వదలకుండా ఫొటోలతో సహా తన సోషల్ మీడియాలో షేర్ చేసి వివాదాన్ని రాజేసింది. ఇప్పుడు అదే నటి భర్తతో రోజాకి ఏవో పాత వ్యవహారాలు ఉన్నాయంటూ సుదీర్ఘమైన మైన పోస్ట్‌ను పెట్టింది శ్రీరెడ్డి. ఇందులో క్యారెక్టర్ గురించి నీచమైన కామెంట్స్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది. Read Also: ‘రోజా గారు మీరు వైసీపీలో ఉన్నందుకు నా పూర్తి మద్దతు, మిమ్మల్ని కించపరచాలని కాదు. మీకు నిజం చెప్పాలనేదే నా ప్రయత్నం’, ‘మీ రచ్చబండ లేదా బతుకు జడ్కా బండికి వాళ్లను పిలవండి. నేనూ కూడా వస్తా’ అంటూ వరుస పోస్ట్‌లు పెట్టింది శ్రీరెడ్డి. అయితే రోజాపై ఇలాంటి ఆరోపణలు చేయడం శ్రీరెడ్డి కొత్తేం కాదు. క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ అప్పుడు కూడా రోజాని టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3159Bce
v
No comments:
Post a Comment