Thursday, 10 October 2019

సూపర్‌ హిట్‌ తరువాత రొటీన్‌ ఫార్ములా సినిమానా?

లాంగ్ గ్యాప్‌ తరువాత ఓ బేబి సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న లేడీ డైరెక్టర్‌ నందినీ రెడ్డి తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. మహానటి సినిమాతో నిర్మాతలుగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న స్వప్న దత్‌, ప్రియాంక దత్‌లు నందిని రెడ్డి నెక్ట్స్ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా కాంటెపరరీ లవ్‌ స్టోరిగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఓబేబి లాంటి డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌ తరువాత మరోసారి ప్రయోగాల జోలికి వెళ్లకుండా రొటీన్‌ ఫార్ములా సినిమాను తెరకెక్కిస్తోంది నందిని రెడ్డి. ఈ సినిమాకు మహాటి, ఓ బేబి సినిమాలకు సంగీతమందించిన మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నాడు. Also Read: ఇటీవల తన మాటలతో సెన్సేషన్‌ సృష్టిస్తున్న లక్ష్మీ భూపాల్ డైలాగ్ రాస్తుండగా జయశ్రీ ఆర్ట్ వర్క్‌ను, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. నందిని రెడ్డితో పాటు నిర్మాతలు ప్రియాంక దత్‌, స్వప్న దత్‌లో గతంలో చేసిన సినిమాలన్నీ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలే కావటంతో ఈ సినిమా కూడా అదే జానర్‌లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు ప్రియాంక, స్వప్నలు మరో భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహానటి సినిమాతో దర్శకుడిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మరో డిఫరెంట్ మూవీని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. Also Read: ఎవడే సుబ్రమణ్యం, మహానటి లాంటి విభిన్న చిత్రాలను రూపొందించిన నాగ్‌ అశ్విన్ తన నెక్ట్స్ సినిమాను కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులను కూడా ఆహ్వానిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాను స్వప్న మూవీస్‌, వైజయంతి మూవీస్‌ సంస్థలు సంయుక్తం నిర్మిస్తున్నాయి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OBeurd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...