Saturday, 26 October 2019

Ruler.. మాస్‌లుక్‌లో బాలయ్య ఇరగదీశాడు!

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రూలర్‌. తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సీకే ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. గతంలో బాలకృష్ణ స్టైలిష్‌ లుక్‌ను రివీల్ చేసిన చిత్రయూనిట్‌ తాజాగా టైటిల్‌తో పాటు మాస్‌ లుక్‌ను రివీల్ చేశారు. పోలీస్‌ గెటప్‌లో ఉన్న బాలయ్య లుక్‌తో పాటు క్యారెక్టర్‌ పేరు ధర్మ అని కూడా రివీల్ చేశారు. పోలీస్‌ గెటప్‌లో ఉన్న బాలయ్య లుక్‌ చూసి అభిమానులను సంబరపడిపోతున్నారు. డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌, గడ్డంతో స్లిమ్‌ కనిపిస్తున్న బాలయ్య లుక్‌ సూపర్బ్ అంటున్నారు ఫ్యాన్స్‌. చాలా కాలంగా ప్రచారంలో ఉన్నట్టుగానే రూలర్‌ అనే టైటిల్‌నే ఫిక్స్‌ చేశారు. పోలీస్‌ బ్యాడ్జ్‌పైన రూలర్‌ అన్న అక్షరాలు చూస్తే సినిమా ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో సాగుతుందనిపిస్తుంది. Also Read: హ్యాపీ మూవీస్‌ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా సోనాల్‌ చౌహాన్‌, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, భూమిక ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు చిరంతన్‌భట్‌ సంగీతమందిస్తున్నారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్‌ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు నిరాశపరచటం, తరువాత వెంటనే ఎలక్షన్లు కూడా రావటంతో బాలయ్య సినిమాలకు గ్యాప్‌ ఇచ్చాడు. దీంతో లాంగ్ గ్యాప్‌ తరువాత వస్తున్న బాలయ్య సినిమా కావటంతో అభిమానులు రూలర్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Pl52bO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...