Saturday, 26 October 2019

క్లబ్ డ్యాన్సర్‌గా రకుల్ ప్రీత్.. సెక్సీ స్టెప్పులతో అదరగొట్టింది

రకుల్ ప్రీత్ సింగ్‌లో ఓ మంచి నటే కాదు డ్యాన్సర్ కూడా ఉంది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ తన సత్తాను నిరూపించుకోవాలని అనుకుంటోంది. అందుకే ఎప్పటికప్పుడు అక్కడి నుంచి వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. పాత్ర చిన్నదైనా కూడా ఓకే చేసేస్తోంది. రకుల్ క్లబ్ డ్యాన్సర్‌గా నటించిన హిందీ చిత్రం ‘మర్జావా’. సిద్దార్థ్ మల్హోత్రా, తారా సుతారియా జంటగా నటించారు. ఈ సినిమాలోని ‘హయ్యా హో’ అనే సాంగ్ వీడియో ఒకటి విడుదలైంది. తులసీ కుమార్, జుబిన్ నౌటియాల్ ఈ పాటను పాడారు. ఇందులో రకుల్ చీర కట్టుకుని క్లబ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. వీడియో విడుదల అవడానికి ముందు సిద్ధార్థ్‌తో మంచంపై పడుకుని, ఏడుస్తున్న సన్నివేశాన్ని చూపించారు. బాధతో మందు తాగుతున్న సిద్ధార్థ్‌ను వద్దు అంటూ రకుల్ ఓదారుస్తూ కనిపించారు. ఈ పాట కోసం రకుల్ నడుంపై టాటూ వేయించుకున్నారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మిలాప్ జవేరీ సినిమాకు దర్శకత్వం వహించారు. రకుల్‌కు తెలుగులో ఉన్నంత పాపులారిటీ బాలీవుడ్‌లో లేదు. అరకొర సినిమాలతో నెట్టుకొస్తున్నారు. బాలీవుడ్‌లో రకుల్ నటించిన ‘దే దే ప్యార్ దే’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇక ‘మర్జావా’ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి. తనకు బాలీవుడ్‌లో అంత పాపులారిటీ రావాలని తానూ కోరుకోవడం లేదని రకుల్ ఒకానొక సందర్భంలో తెలిపారు. తనకు దక్షిణాదిలో వచ్చినంత పాపులారిటీ బాలీవుడ్‌లోనూ రావాలని కోరుకోవడం సబబు కాదని, మార్కెట్ వాల్యూ లేకపోయినా చేసిన సినిమాలు ప్రేక్షకులకు నచ్చితే చాలని పేర్కొన్నారు. ఇక తెలుగులో రకుల్ ‘మన్మథుడు 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. విలక్షణ నటుడు భారతీయుడు 2 సినిమాలో రకుల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమిళంలో శివ కార్తికేయన్‌కు జోడీగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. మన్మథుడు 2 తర్వాత ఆమె మరో తెలుగు సినిమాకు సంతకం చేయలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WhKkuB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...