Wednesday, 2 October 2019

Kanchana రీమేక్.. షాకిస్తున్న అక్షయ్ కుమార్ హిజ్రా లుక్

తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి విజయం అందుకున్న చిత్రం ‘కాంచన’. ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ నటించారు. ఓ వ్యక్తికి అన్యాయం జరిగి చనిపోవడం ఆ తర్వాత ఆ వ్యక్తి రాఘవ శరీరంలోకి ప్రవేశించి ప్రతీకారం తీర్చుకోవడం ఈ సినిమా కాన్సెప్ట్. ఇప్పటివరకు కాంచన ఫ్రాంచైస్‌ దాదాపు నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నవే. అందుకే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ సినిమాను చూసి ఇంప్రెస్ అయ్యి హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నారు. రీమేక్‌కు ‘లక్ష్మీ బాంబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు కూడా రాఘవ లారెన్సే దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. దేవి నవరాత్రుల సందర్భంగా అక్షయ్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. అమ్మవారి ఎదుట హిజ్రా గెటప్‌లో నిలబడినట్లుగా ఉన్న ఆ లుక్‌లో అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. ఇప్పటివరకు అక్షయ్ హిజ్రా పాత్రలో నటించిందిలేదు. కానీ ఆయన ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అన్నది కాకుండా ఓ మంచి కాన్సెప్ట్‌ను ఎంచుకున్నామా లేదా అన్న విషయంపైనే అక్షయ్ ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తున్నారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్, షబీనా ఎంటర్‌టైన్‌మెంట్, తుషార్ ఎంటర్‌టైన్‌మెంట్ హౌస్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకు సంబంధించిన లుక్ ఒకటి గతంలో విడుదలైంది. అయితే ఆ లుక్ రాఘవ లారెన్స్‌కు నచ్చలేదు. ఓ దర్శకుడిగా తన అనుమతి లేకుండా ఫస్ట్‌లుక్‌ను డిజైన్ చేయడం తనకు నచ్చలేదని, ఆత్మాభిమానం చంపుకోలేనంటూ రాఘవ సినిమా నుంచి తప్పుకొన్నారు. ఆయనకు నిర్మాణ సంస్థలకు వివాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసి అక్షయ్ పరిష్కరించాలనుకున్నారు. రాఘవతో మాట్లాడి ఆయన్ను సినిమాకు దర్శకత్వం వహించాలని ఒప్పించారు. అక్షయ్‌పై అభిమానంతో రాఘవ సినిమాకు దర్శకత్వం వహించేందుకు ఒప్పుకున్నారు. ఇప్పుడు రాఘవకు నచ్చినట్లుగానే హిజ్రా గెటప్‌లో అక్షయ్ కుమార్ లుక్‌ను డిజైన్ చేశారట. మరి సినిమాతో హిందీ ప్రేక్షకుల మనసులు రాఘవ దోచుకుంటారో లేదో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nbgZFi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...