Thursday, 24 October 2019

ట్రాఫిక్‌లో Genelia భర్త చిందులు, పోలీసులు చూసేసుంటారు

ప్రముఖ బాలీవుడ్ నటుడు, జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ నడిరోడ్డుపై డ్యాన్స్ చేశారు. ముంబయిలోని ఓ రోడ్డు వద్ద ట్రాఫిక్ నిలిచి ఉండటంతో అతను గబగబా కారు దిగి డ్యాన్స్ చేసి వెంటనే కారులో కూర్చున్నాడు. రితేష్ ఇలా చేయడానికి కారణం అక్షయ్ కుమార్ విసిరిన ఛాలెంజే. అక్షయ్, రితేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘హౌస్‌ఫుల్ 4’. రేపు ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ‘షైతాన్ కా సాలా’ అనే పాట ఉంది. ఈ పాట వీడియోలో అక్షయ్ మహారాజు గెటప్‌లో డ్యాన్స్ చేస్తుంటాడు. ఈ డ్యాన్స్‌ రోడ్డు మీద వేయాలని అక్షయ్ రితేష్‌కు చెప్పాడట. దాంతో ట్రాఫిక్‌లో కారు ఆగగానే రితేష్ గబగబా దిగి డ్యాన్స్ చేశాడు. దీనిని కారులో ఉన్న చిత్రబృందం రికార్డ్ చేసింది. అయితే ఆ సమయంలో పోలీసులు కానీ చూసుంటే పెద్ద రచ్చయ్యేది. ఎందుకంటే రితేష్‌ను చూడగానే ఫ్యాన్స్ సెల్ఫీ కోసం వాహనాల నుంచి బయటికి వచ్చుంటే ట్రాఫిక్ స్తంభించింపోయి ఉండేది. ఇప్పటికే అక్కడి సీసీ కెమెరాల్లో రితేష్ వేసిన డ్యాన్స్ రికార్డ్ అయింది. త్వరలో మహారాష్ట్ర పోలీసుల నుంచి వార్నింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా విషయానికొస్తే ఇందులో అక్షయ్, రితేష్‌తో పాటు బాబీ డియోల్ మరో హీరోగా నటించారు. కృతి సనన్, కృతి కర్బంద, పూజా హెగ్డే కథానాయికలుగా నటించారు. భారీ స్థాయిలో సినిమాకు ప్రమోషన్స్ దక్కుతున్నాయి. హౌస్‌ఫుల్ పేరుతో దిల్లీలో ఓ స్పెషల్ రైలును కూడా రైల్వే శాఖ ప్రారంభించింది. రెండు రోజుల పాటు ముంబయి నుంచి దిల్లీ వరకు ఈ సినిమా చిత్రబృందం రైలులో ప్రయాణించి సినిమాకు బాగా ప్రచారం కల్పించింది. అంతేకాదు ఇతర సెలబ్రిటీలు కూడా ఈ డ్యాన్స్ చేస్తూ రికార్డ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సినిమాకు బాగా ప్రచారం కల్పిస్తున్నారు. చూడబోతే హౌస్‌ఫుల్ ఫ్రాంచైస్‌ నుంచి రాబోతున్న ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హౌస్‌ఫుల్ అయ్యేలా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31J6ozA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...