Wednesday, 2 October 2019

ఆ స్టార్ హీరో డ్రెస్ చూసి ఏడ్చేసిన చిన్నారి.. వీడియో వైరల్

2:ఫన్నీ దుస్తులు ధరించడంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌వీర్ సింగ్‌ను మించినవారు ఎవ్వరూ లేరు. ఆయన వేసుకునే దుస్తులు మరే హీరో వేసుకోవడానికి ధైర్యం చేయడు. హీరోల మాట దేవుడెరుగు. సామాన్య వ్యక్తులు కూడా వేసుకోలేరు. అంత ఫన్నీగా ఉంటాయి ఆయన దుస్తులు. కొన్ని సందర్భాల్లో రణ్‌వీర్ వేసుకున్న దుస్తులు చూసి ఆయన భార్య దీపిక పదుకోన్ తలపట్టుకున్నారు. తాజాగా రణ్‌వీర్ తన వింత డ్రెస్సింగ్ స్టైల్‌తో ఓ పిల్లాడిని ఏడిపించేశాడు. మోకాలి పొడవు ఉన్న రెడ్ కలర్ హుడీ ధరించి ముంబయిలోని ఓ డబ్బింగ్ స్టూడియోకి వెళ్లాడు రణ్‌వీర్. ఆ సమయంలో రణ్‌వీర్‌తో సెల్ఫీలు దిగడానికి ఫ్యాన్స్ చుట్టుముట్టారు. వారిలో ఓ వ్యక్తి తన కూతురితో కలిసి వచ్చాడు. అతను రణ్‌వీర్ కారు పక్కనే ఆగి ఉన్నాడు. రణ్‌వీర్ కారు ఎక్కుతుండగా అతన్ని దగ్గర్నుంచి చూడగనే ఆ చిన్నారి భయపడి ఏడ్చేసింది. రణ్‌వీర్ గారి గెటప్ ఆ రేంజ్‌లో ఉంది మరి. చూడటానికి ఏదో బూచాడిలా ఉన్న రణ్‌వీర్‌ను చూసి పిల్లలు భయపడక ఇంకేం చేస్తారు చెప్పండి. అతన్ని చూసి పాప ఏడుస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు వీడియో తీశారు. ఓసారి రణ్‌వీర్ తెల్ల డ్రెస్సు వేసుకుని బయటికి వచ్చాడు. అది చూడటానికి అచ్చం కండోమ్‌లా ఉందని నెటిజన్లు తెగ కామెంట్లు చేశాడు. అసలు రణ్‌వీర్‌ డ్రెస్సింగ్ స్టైల్ ఎవరి నుంచి వచ్చిందో తెలీదు కానీ ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఆయన ఏ దుస్తులు వేసుకొస్తారా అని ఎదురుచూసే ఫొటోగ్రాఫర్లే ఎక్కువగా ఉన్నారు. బయటికి వెళ్లేటప్పడు రణ్‌వీర్ ఏ భయంకరమైన డ్రెస్ వేసుకుంటాడోనని అప్పుడప్పుడూ దీపిక కూడా భయపడుతూ ఉంటుందట. దీపిక భయపడడంలో ఎంత మాత్రం తప్పులేదు. రణ్‌వీర్ వేసుకునే దుస్తులన్నీ కలెక్ట్ చేసి ఓ మ్యూజియంలో పెట్టినా ఆశ్యర్చపోనక్కర్లేదు. బాలీవుడ్‌లోకి వచ్చాక ఆయనకు ఈ డ్రెస్సింగ్ సెన్స్ అలవడలేదు. ఆయన 11 ఏళ్ల వయసులోనే స్టైల్ విషయంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. చిన్నప్పుడే వింత హెయిర్ స్టైల్‌ను ట్రై చేశారు. ఆ ఫొటో చూసి దీపిక తలపట్టుకుంది. మరో విషయం ఏంటంటే.. ఆయన కథానాయకుడిగా నటించిన ‘గల్లీ బాయ్’ సినిమా ఆస్కార్ ఎంట్రీ దక్కించుకుంది. ఒకవేళ ఈ సినిమా నామినేట్ అయితే వేడుకకు వెళ్లడానికి రణ్‌వీర్ ఏ డ్రెస్ వేసుకుంటాడోనని అక్కడి వారు కూడా ఎగ్జైట్ అవుతున్నారట. ఆయన దుస్తులు ధరించే విధానం ఎలా ఉన్నా.. బాలీవుడ్‌లో బెస్ట్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చకున్నారు. రణ్‌వీర్ వేసుకునే డ్రెస్సులు ఎలా ఉంటాయో కింద ఉన్న వీడియోతో పాటు ఫొటోలూ చూస్తే మీకే తెలుస్తుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nztzOV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...