Wednesday, 2 October 2019

సాహో బ్యూటీ టైగర్‌తో డేటింగ్...?

బాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న, యూత్‌లో ఫాలోయింగ్ ఉన్న హీరో టైగర్ ష్రాఫ్. ప్రస్తుతం బాలీవుడ్‌లో కండల వీరుడు అనే టైటిల్ అతనికే సెట్ అవుతుంది. బాలీవుడ్‌లో ఎఫైర్స్ అనేవి సర్వసాధారణం కాబట్టి కూడా అక్కడ హాట్ హీరోయిన్‌గా పేరున్న దిశాపటానితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు అనే మాట బాగా వినిపించేది. కొంతకాలం ఆ విషయంలో ఇద్దరు సీక్రసీ మైంటైన్ చేసినా కూడా ఆ తరువాత మాత్రం పబ్లిక్‌లో కూడా జంటగా కనిపించడం స్టార్ట్ చేసారు. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా లవ్‌లో ఉన్నాం అనికానీ, రిలేషన్ షిప్‌లో ఉన్నాం అని కానీ క్లారిటీ ఇవ్వలేదు. కానీ చూసేవాళ్లకు అర్ధం అవుతుంది కాబట్టి అది అర్ధం చేసుకుని రాసుకున్నారు. Also Read: అయితే గత కొంతకాలంగా వీళ్లిద్దరికీ పెద్దగా పడట్లేదు. ఏ విషయంలో తేడా వచ్చిందోగానీ పబ్లిక్ గానే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూపించడం మొదలుపెట్టారు. అంబాని కొడుకు పెళ్లిలో కూడా అందరిముందే దిశా పై పబ్లిగ్గా అసహనం వ్యక్తం చేసాడు టైగర్ ష్రాఫ్. అది చూసి ఆమెతో సహా అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ అంతా కూడా షాక్ అయ్యారు.భాగీ 2 సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు.ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ విచిత్రంగా ఆ తరువాతే వీళ్లిద్దరి మధ్య కాస్త కలతలు మొదలయ్యాయి. దాంతో ఇద్దరి మధ్య బాండింగ్ కూడా దెబ్బతింది. బాలీవుడ్ లేటెస్ట్ గాసిప్ ఏంటంటే వీళ్ళిద్దరూ విడిపోయారంట. అయితే ఆమెనుండి విడిపోయిన టైగర్ ష్రాఫ్ ఇప్పుడు శ్రద్దా కపూర్‌తో ప్రేమలో పడ్డాడట. Also Read: వీళ్ళిద్దరూ వర్షం హిందీ రీమేక్ అయిన భాగీలో కలిసి నటించారు. ఇప్పుడు మళ్ళీ భాగీ 3లో కూడా వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారు. గతంలో ఆదిత్య రాయ్ కపూర్ తో కొన్నాళ్లపాటు ప్రేమాయణం నడిపిన ఆ తరువాత అతనితో బ్రేక్ అప్ చేసుకుంది అనేది బాలీవుడ్‌లో ఓపెన్ సీక్రెట్ అంటారు. సో, ఇప్పుడు ఇద్దరూ కూడా సింగిల్‌గా ఉన్నారు. భాగీ 3 స్టార్ట్ అవ్వడానికి ముందే వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్‌కి మించి ఎదో ఉంది అనే గాసిప్ వినిపించింది. ఇప్పుడు ఇక ఆ సినిమా సెట్స్ మీదకి రావడం, వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు కలిసి కనిపిస్తుండడంతో ఆ అనుమానం బలపడింది. గతంలో ఎప్పుడూ బయటపెద్దగా కనిపించని శ్రద్దా ఈ మధ్య మాత్రం టైగర్ ఎక్కడికి వెళ్లినా అతనితోపాటు కలిసి కనిపిస్తుంది. Also Read: గతంలో దిశా టైగర్‌తో కలిసి కనిపించినట్టే ఇప్పుడు శ్రద్ధ కూడా కనిపిస్తుంది,కానీ ఎప్పట్లానే మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే లేటెస్ట్‌గా టైగర్ ష్రాఫ్, హ్రితిక్ రోషన్ కలిసి నటించిన వార్ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసిన దిశా ఆ సినిమా పోస్టర్‌ని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ పాజిటివ్‌గా నాలుగు మాటలు కూడా రాసింది. దీంతో కొత్తగా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటి? అని అవాక్కవుతన్నారు. మరి దిశా, శ్రద్ధలలో టైగర్ ఓటు ఎవరికో? తెలియాలంటే, ఈ మ్యాటర్ పై మరింత క్లారిటీ రావాలంటే మాత్రం మరికొంతకాలం ఆగాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mRAxyc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...