అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన అందాల భామ జాన్వీ కపూర్. శ్రీదేవి అందంతో పాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకున్న ఈ భామ తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించింది. దడక్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అదే సమయంలో నటిగానూ వావ్ అనిపించింది. ప్రస్తుతం ఈ భామ ఓ బయోపిక్‌లో నటిస్తోంది. భారతీయ వాయుసేనలో పనిచేసిన తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సెనా కథతో తెరకెక్కుతున్న సినిమాలో టైటిల్ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు రూహీ అఫ్జా సినిమాలోనూ నటిస్తోంది.వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న వెబ్‌సిరీస్ ఘోస్ట్ స్టోరీస్‌లో నటించేందుకు ఓకె చెప్పింది ఈ బ్యూటీ. Also Read: షూటింగ్‌లతో బిజీగా ఉండే ఈ భామ పేజ్ 3 ప్రొగ్రామ్స్‌లోనూ సందడి చేస్తోంది. ముఖ్యంగా అవకాశం ఉన్న ప్రతిసారి తన గ్లామర్ యాంగిల్‌ను బయటపెడుతున్న అలరిస్తోంది. తాజాగా ఎల్లె అవార్డ్స్ వేడుకకు హాజరైన జాన్వీ తన అందాల ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. బ్రాంజ్ కలర్ థై హై స్లిట్ గౌన్‌లో దర్శనమిచ్చిన ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్‌గా మారింది. తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జాన్వీ .. స్పామ్ చేస్తున్నందుకు క్షమించండి అంటూ కామెంట్ చేసింది. అయితే ఆ ఫోటోలను చూసిన అభిమానులు మాత్రం ఇది స్పామ్ కాదు సెక్స్ అంటున్నారు. జాన్వీ ఫోటోలపై అన్షుల కపూర్, రియా కపూర్, మహీ కపూర్ టూ హాట్ అంటూ స్పందించారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LSauAw
v
No comments:
Post a Comment