Sunday, 6 October 2019

బిగ్ బాస్ భామ కారు బీభత్సం.. చావుబతుకుల్లో స్విగ్గీ బాయ్! పూటుగా తాగిందా?

తమిళ బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్స్, హాట్ హీరోయిన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న లగ్జరీ కారు స్విగ్గీ డెలివరీ బాయ్‌ను ఢీ కొట్టడంతో అతను చావు బతుకుల మధ్య పోరాటం చేస్తూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. పాదం, కవలై వెండమ్, మణియార్ కుదుబం, జోంబీ సినిమాలతో హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్న తమిళ నటి ఆషికా ఆనంద్ చెన్నైలో నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 05వ తేదీ శనివారం అర్ధరాత్రి ఆషికా ఆనంద్ తన స్నేహితులతో కలిసి కారులో లాంగ్ ట్రిప్‌కి వెళ్లారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు నుంగబాక్కమ్ ప్రాంతంలో యాక్సిడెంట్‌కు గురైంది. మితిమీరిన వేగం కారణంగా డ్రైవర్ అదుపుచేయలేక పక్కనే ఉన్న భరత్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్‌ను ఢీ కొట్టి పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకుపోయింది. దీంతో డెలివరీ బాయ్‌కి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే హీరోయిన్ యషికా అక్కడి నుంచి పరార్ కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కారు డ్రైవర్‌తో పాటు హీరోయిన్ యషికా, ఆమె స్నేహితులు ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. యాక్సిడెంట్ కాగానే గాయాలపాలైన వ్యక్తిని పట్టించుకోకుండా క్యాబ్ బుక్ చేసుకుని అక్కడ యషికా ఆనంద్ ఉడాయించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన సందర్భంలో భరత్ ఒక్కడే అక్కడ ఉన్నాడు కాబట్టి సరిపోయింది కాని.. లేదంటే రద్దీగల ఈ ప్రదేశంలో పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుతం గాయాలపాలైన భరత్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాక్సిడెంట్ ఎవరు చేశారు? కారు ఎవరిది? ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ తాగి ఉన్నాడా? అసలు కారు డ్రైవ్ చేసింది ఎవరు అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2AIKnWD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...